Begin typing your search above and press return to search.
బిపిన్ రావత్ సక్సెస్ స్టోరీ వింటే ఆశ్చర్యపోతారు..
By: Tupaki Desk | 9 Dec 2021 6:32 AM GMTభారతదేశం మొట్టమొదటి త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్ మరణం దేశాన్ని దేశాన్ని దిగ్బ్రాంతిలోకి నెట్టింది. ఆయన మరణించాడన్న వార్తతో దేశ ప్రజల మనసులు కలిచివేశారు. నిఖార్సయిన దేశభక్తుడిని కోల్పోయామని వివిధ మార్గాల ద్వారా ప్రజలు, ప్రముఖులు ఆయన మృతికి సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
1978లో మొదలైన ఆయన కెరీర్ చివరి రోజు వరకు విధుల్లోనే ఉండడం విశేషం. అంచెలంచెలుగా తన సత్తా చాటుతూ భారత్ కు రక్షణ కల్పించడంలో భాగస్వాముడయ్యారు. మరికొద్ది రోజుల్లో ఆయన పదవీకాలం ముగియనుండగా.. శాశ్వతంగా లోకాన్ని విడిచి వెళ్లడం బాధాకరమైన విషయం.
బిపిన్ రావత్ మరణం తరువాత ఆయన గురించి రకరకాల చర్చలు మొదలయ్యాయి. ఇప్పటి వరకు ఇండియిన్ ఆర్మీ, నేవీ, నౌకదళానికి ప్రత్యేకంగా అధికారులు ఉన్నారు. కానీ మొట్టమొదటిసారిగా ఈ మూడు రక్షణ దళాలకు బిపిన్ రావత్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాప్(సీడీఎస్) గా బాధ్యతలు చేపట్టారు.
2019 డిసెంబర్ 30 నుంచి ఈ పదవిలో కొనసాగుతున్న బిపిన్ రావత్ 2022 జనవరిలో రిటైర్మెంట్ కావాల్సి ఉంది. సాధారణంగా ఆర్మీ అధికారుల రిటైర్మెంట్ 62 సంవత్సరాలుగా ఉండేది. కానీ బిపిన్ రావత్ ను సీడీఎస్ గా నియమించేందుకు 65 ఏళ్లకు పెంచారు. దీంతో ఆయన సేవలు దేశానికి ఎంత అవసరమో అర్థం చేసుకోవచ్చు.
ఉత్తరాఖండ్ రాష్ట్రానికి చెందిన బిపిన్ రావత్ 1958లో పౌరిలోని రాజపుత్ కుటుంబంలో జన్మించారు. ఆయన పూర్తి పేరు బిపిన్ లక్ష్మణ్ సింగ్ రావత్. ఈయన కుటుంబం దశాబ్దాలుగా ఆర్మీగా సేవలు చేస్తోంది. ఆయన తండ్రి లక్ష్మణ్ సింగ్ రావత్ లెప్టినెంట్ జనరల్ గాపదవీ విరమణ పొందారు. అలాగే ఆయన తల్లి ఉత్తర కాశీ మాజీ ఎమ్మెల్యే కిషన్ సింగ్ పర్మార్ కూతురు.
రావత్ డెహ్రడూన్ లోని కేంబ్రియన్ హాల్ స్కూల్ లో విద్యాభ్యాసం మొదలుపెట్టారు. ఆ తరువాత ఇండియన్ మిలిటరీ అకాడమీలో చేరారు. అక్కడ డిఫెన్స్ స్టడీస్ లో ఎంఫిల్ డిగ్రీ చేసి ఆ తరువాత మద్రాస్ విశ్వ విద్యాలయం నుంచి మేనేజ్మెంట్, కంప్యూటర్ స్టడీస్లో డిప్లొమా పొందారు.
1978లో ఆర్మీలో చేరిన బిపిన్ రావత్ తన తండ్రి పనిచేసిన 5వ బెటాలియన్లోనే సేవలు అందించారు. 42 ఏళ్లపాటు ఆర్మీలో పనిచేసిన బిపిన్.. బిగ్రేడ్ కమాండర్ గా.. జనరల్ ఆఫీసర్ కమాండ్ ఇన్ చీపఫ్, జనరల్ స్టాఫ్ ఆఫీసర్, కల్నల్ మిలిటరీ సెక్రటరీ, డిప్యూటీ మిలిటరీ సెక్రటరీ, సీనియర్ ఇన్ స్ట్రక్టర్, ఆర్మీ స్టాప్ కు వైస్ చీఫ్ గా పనిచేశారు.
త్రివిధ దళాలకు వేర్వేరు అధిపతులు ఉండగా వీరి ముగ్గురిని సమన్వయం చేసేలా మరో అధికారిని నియమించాలని 1980లో జనరల్ కేవీ కృష్ణారావు ప్రతిపాదించారు. 1999 కార్గిల్ యుద్ధం సమయంలో చాలా మంది సైనికులు, సీనియర్ అధికారులు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. దీంతో మొట్టమొదటి త్రివిధ దళాదిపతిగా బిపిన్ రావత్ నియామకమ్యారు.
దేశంలో తొలి సీడిఎస్ గా బిపిన్ రావత్ చరిత్రల్లోకెక్కారు. ఆయన యూనిఫాం మీద మూడు దళాలకు చెందిన చిహ్నాలు ఉంటాయి. రక్షణ మంత్రికి ప్రిన్సిపల్ మిలిటరీ అడ్డైజర్ గా కూడా ఉన్నారు.
కమ్యూనికేషన్స్, ఆపరేషన్స్, రిపేర్, మెయింటెనెన్స్ లాంటి అంశాల్లో త్రివిధ దళాలను సమన్వయం చేసుకుంటూ భారత రక్షణ వ్యవస్థను పటిష్టం చేయడానికి బిపిన్ రావత్ కృషి చేస్తున్నారు. కాగా 2015లో నాగాలాండ్ లో జరిగిన హెలీ క్యాప్టర్ ప్రమాదంలో బిపిన్ రావత్ క్షేమంగా బయపడ్డారు.. కానీ ఈసారి హెలీక్యాప్టర్ ప్రమాదంలో మాత్రం తప్పించుకోలేకపోయారు.