Begin typing your search above and press return to search.
లండన్ మాల్ లో యాసిడ్ ఎటాక్!
By: Tupaki Desk | 24 Sep 2017 4:38 AM GMTఒకప్పుడు ఫుల్ సేఫ్ అన్నట్లుగా ఉండే బ్రిటన్ లో ఇప్పుడేం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి. ఒకటి తర్వాత ఒకటిగా చోటు చేసుకుంటున్న వరుస ఉగ్రదాడుల నేపథ్యంలో ఆ దేశ ప్రజలు వణికిపోతున్నారు. మరీ.. ముఖ్యంగా ఇటీవల కాలంలో ఆ దేశ రాజధాని లండన్ మహానగరంలో ఉగ్రదాడులు వరుసగా చోటు చేసుకుంటున్నాయి.
ఇదిలా ఉంటే.. తాజాగా ఉగ్ర కలకలం చోటు చేసుకుంది. ఒక షాపింగ్ మాల్ లో గుర్తు తెలియని దుండగులు యాసిడ్ దాడికి పాల్పడటం సంచలనంగా మారింది. ఈ ఘటనలో ఆరుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. శనివారం రాత్రి ఈస్ట్ లండన్ లోని న్యూహమ్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రత్యక్ష సాక్ష్యుల కథనం ప్రకారం శనివారం రాత్రి 8 గంటల వేళలో స్టోర్ ఫోర్ట్ షాపింగ్ మాల్ లోకి కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు షాపింగ్ కు వచ్చారు.
వీరిపై కొందరు యాసిడ్ దాడికి పాల్పడ్డారు. యాసిడ్ జల్లే ముందు సదరు వ్యక్తులతో వాగ్వాదానికి దిగినట్లుగా చెబుతున్నారు. యాసిడ్ మంటను భరించలేని వారు పక్కనే ఉన్న టాయిలెట్ లోకి వెళ్లి ముఖ కడుక్కున్నారు. ఘటన చోటు చేసుకున్న వెంటనే పోలీసులు రంగప్రవేశం చేసి క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.
యాసిడ్ దాడిలో ఆరుగురికి తీవ్ర గాయాలైనట్లుగా గుర్తించారు. ఈ దాడికి పాల్పడింది ఎవరన్న దానిపై ఇంకా స్పష్టత రాలేదు. ఈ ఘటనకు సంబంధం ఉందని భావిస్తూ ఒక వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు బయటకు రావాల్సి ఉంది. సీసీ కెమేరా ఫుటేజ్ ను విచారణ అధికారులు విశ్లేషిస్తున్నారు.