Begin typing your search above and press return to search.

వివాహిత పై యాసిడ్ దాడి .. కారణం అదేనా ?

By:  Tupaki Desk   |   5 Dec 2019 6:10 AM GMT
వివాహిత పై యాసిడ్ దాడి ..  కారణం అదేనా ?
X
ఈ మధ్య కాలంలో ఆడవారిపై ఘోరాలు ఎక్కువైపోతున్నాయి. ఎక్కడ చూసిన అఘాయిత్యాలు , యాసిడ్ దాడులు , హత్య చేయడాలు. కామంతో కళ్ళు మూసుకుపోయిన కొందరు మానవ మృగాళ్లు .. ఆడవారిని టార్గెట్ చేసి వారి నిండు జీవితాలని నాశనం చేస్తున్నారు. ఈ మద్యే హైదరాబాద్ లో వెటర్నరీ డాక్టర్ దిశ ఉదంతం అందరికి తెలిసే ఉంటుంది. వీటిపై పోలీసులు , ప్రభుత్వాలు ఇన్ని చర్యలు తీసుకున్న కూడా ఆగడంలేదు. తాజాగా విశాఖ లో మరో ఘోరం జరిగింది. వివాహిత పై యాసిడ్ తో దాడి చేసారు. ఇక్కడ విస్తుగొలిపే మరో విషయం ఏమిటంటే .. ఆ వివాహితపై యాసిడ్ దాడి చేసింది కూడా మరో మహిళే కావడం విశేషం. ఆడవాళ్ళకి ఆడవారే శత్రువు అన్నట్టు .. విశాఖపట్నం గాజువాక లో వివాహిత పై యాసిడ్ తో దాడి చేసి అక్కడినుండి వెళ్ళిపోయింది.

విశాఖపట్నం లోని గాజువాక సమతా నగర్‌లో ఈ దారుణం జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే ... హైదరాబాద్‌ కు చెందిన 27ఏళ్ల శిరీష బుధవారం మధ్యాహ్నం సమతానగర్‌లోని అపార్టుమెంట్‌లో నివాసం ఉంటున్న తన ఆడపడుచు దివ్య వద్దకు వచ్చారు. శిరీష దంపతుల మధ్య తరచూ ఘర్షణలు జరుగుతుండడంతో, శిరీష కు కౌన్సిలింగ్ ఇవ్వడానికి దివ్య దగ్గరకు శిరీషను పంపించినట్టుగా తెలుస్తుంది.అయితే సాయంత్రం ఐదు గంటల సమయంలో గుర్తుతెలియని మహిళ అపార్ట్‌మెంట్‌ వద్దకు వచ్చి సెల్లార్‌లో శిరీషతో దాదాపు రెండు గంటల పాటు వాగ్వాదం చేసింది. చివరకు వెంట తెచ్చిన సీసాలోని యాసిడ్‌ను శిరీష ముఖంపై పోసేందుకు ప్రయత్నించగా, శిరీష తప్పించుకునే ప్రయత్నం చేసింది. అయినప్పటికీ శిరీషకు 30 శాతం గాయాలయ్యాయి. యాసిడ్ దాడిలో గాయపడిన ఆమెను అపార్ట్‌మెంట్‌వాసులు గాజువాకలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు.

శిరీష భర్త ప్రభాత్‌ హైదరాబాద్‌లోని ఒక బంగారం దుకాణంలో పనిచేస్తున్నారు. శిరీష పై దాడికి పాల్పడింది శిరీషకు పరిచయస్థుడైన వ్యక్తి భార్యనేమో అన్న క్రమంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం ఆమె స్థానిక ఆర్కె ఆసుపత్రి లో చికిత్స పొందుతున్నారు. హైదరాబాద్ నుండి వచ్చిన గంటల వ్యవధి లోనే శిరీష పై యాసిడ్ దాడి జరగడం తో పోలీసులు శిరీష కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చి వారి నుండి వివరాలు తెలుసుకుంటున్నారు. ఎవరిపై నైనా అనుమానం ఉందా అని పోలీసులు వారిని అడుగుతున్నారు. ఒక మహిళే ..మరో మహిళ పై యాసిడ్ దాడి చేయడం తో స్థానికంగా ఈ ఘటన సంచలనం గా మారింది.