Begin typing your search above and press return to search.

ఆ ప్రముఖ సామాజిక కార్యకర్తకు కరోనా లేదట

By:  Tupaki Desk   |   3 March 2020 4:22 AM GMT
ఆ ప్రముఖ సామాజిక కార్యకర్తకు కరోనా లేదట
X
ప్రముఖ సామాజిక కార్యకర్త, ప్రజ్వల సంస్థ వ్యవస్థాపకురాలు సునీతా కృష్ణన్‌ తనకు కరోనా సోకిందేమో అన్న అనుమానంతో హైదరాబాద్ లోని గాంధీ ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే. తాజాగా వచ్చిన బ్లడ్ శాంపిల్స్ రిపోర్ట్స్ ప్రకారం సునీతకు కరోనా లేదని తేలింది. కరోనా టెస్ట్ లో నెగెటివ్ రావడంతో సునీతా గాంధీ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. తనకు కరోనా లేదని తేలిందని, ఈ విషయం చాలా సంతోషాన్నిచ్చిందని సునీతా ట్వీట్ చేశారు. కరోనా టెస్ట్ రిజల్ట్స్ నెగెటివ్ రావడంతో ఊపిరి పీల్చుకున్నానని, తన కోసం ప్రార్థించిన మిత్రులకు, సన్నిహితుల ధన్యవాదాలని సునీతా ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా గాంధీ ఆసుపత్రిలో తన అనుభవాన్ని సునీత నెటిజన్లతో పంచుకున్నారు.

గాంధీ ఆసుపత్రిలో తన అనుభవం ఎలా ఉందంటూ చాలామంది అడిగారని సునీతా ట్వీట్ చేశారు. అక్కడ అంతా బాగానే ఉందని, ప్రత్యేకించి అబ్దుల్ హబీబ్ అనే యువ పారా మెడిక్ తనను ఎంతో జాగ్రత్తగా చూసుకున్నాడని సునీత అన్నారు. తాను అక్కడ సౌకర్యవంతగా ఉండేందుక హబీబ్ అన్ని ఏర్పాట్లు చేశారని, ఆయనకు ధన్యవాదాలు తెలుపుతున్నానని సునీత ట్వీట్ చేశారు.

కాగా, ఇటీవల బ్యాంకాక్ పర్యటన నుంచి వచ్చిన సునీత...దగ్గు.. జ్వరంతో బాధ పడుతున్నారు. దీంతో ఏమాత్రం ఆలస్యం చేయకుండా...గాంధీ ఆసుపత్రి హెల్ప్ డెస్క్ ను సునీత సంప్రదించారు. తనకు కరోనా ఉందేమో నన్న అనుమానంతో బ్లడ్ టెస్ట్ చేయాలని కోరారు. ఐసోలేటెడ్ వార్డులో అబ్జర్వేషన్ లో ఉన్న సునీత...తాజాగా బ్లడ్ శాంపిల్స్ రిజల్ట్స్ నెగెటివ్ రావడంతో డిశ్చార్జ్ అయ్యారు. అందరు సెలబ్రిటీలలా కాకుండా ...తనకు కరోనా ఉందన్న అనుమానం వచ్చినప్పటి నుంచి....కరోనా లేదని డిక్లేర్ అయ్యేవరకు ...తన పరిస్థితిని సునీతా సోషల్ మీడియాలో షేర్ చేశారు. నిర్భయంగా కరోనాపై తన స్టేటస్ చెప్పిన సునీతాపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.