Begin typing your search above and press return to search.

వైర‌ల్‌ వీడియో : ఏసీటీవో ప‌ద్మ‌కు ఏమైంది?

By:  Tupaki Desk   |   10 April 2017 1:35 PM GMT
వైర‌ల్‌ వీడియో : ఏసీటీవో ప‌ద్మ‌కు ఏమైంది?
X
ఏపీ వాణిజ్య ప‌న్నుల శాఖ‌లో అసిస్టెంట్ క‌మ‌ర్షియ‌ల్ ట్యాక్స్ ఆఫీస‌ర్‌ గా విధులు నిర్వ‌ర్తిస్తున్న ప‌ద్మ గుర్తున్నారా? ఎందుకు గుర్తుండ‌రు... అంద‌రికీ గుర్తుండే ఉంటారు. ఎందుకంటే రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత ఏపీ పాల‌న హైద‌రాబాదు నుంచి అమ‌రావ‌తికి త‌ర‌లుతున్న క్ర‌మంలో అక్క‌డికెళ్లేందుకు మొండికేస్తున్న ఉద్యోగుల్లో ఉత్సాహం నింపేందుకు ప‌ద్మ ఆద‌ర్శంగా నిల‌బ‌డ్డారు. హైద‌రాబాదు నుంచి అమ‌రావ‌తి వ‌ర‌కు సైకిల్ యాత్ర చేసిన ప‌ద్మ నాడు ఉద్యోగుల‌కు నిజంగానే ఆద‌ర్శంగా నిల‌బ‌డ్డారు. ప‌ద్మ యాత్ర త‌ర్వాత ఉద్యోగుల్లోనూ కొంత మార్పు కొట్టొచ్చిన‌ట్లు క‌నిపించ‌గా... ఇప్పుడు ఏపీ పాల‌న మొత్తం అమరావ‌తి నుంచే సాగుతోంది. ఉద్యోగుల్లో కొత్త ఉత్సాహం నింపేందుకు ప‌ద్మ చేసిన సాహ‌సాన్ని అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది. ప్ర‌స్తుతం అమ‌రావ‌తిలోని వాణిజ్య ప‌న్నుల శాఖ క‌మిష‌నర్ కార్యాల‌యంలో ప‌ద్మ ఏసీటీవోగా ప‌నిచేస్తున్నారు. అయినా ఇప్పుడు ప‌ద్మ ప్ర‌స్తావ‌న ఎందుక‌నేగా. నాడు ఉద్యోగ లోకానికి ఆద‌ర్శంగా నిలిచిన ప‌ద్మ‌... ఇప్పుడు ఇలా విచిత్రంగా న‌డిరోడ్డుపై హ‌ల్ చ‌ల్ చేసింది.

త‌న ప‌రిధిలోకి రాని ప్రాంతానికి వెళ్లి... ఓ సిమెంట్ కొట్టులో కూర్చుని స‌ద‌రు దుకాణం య‌జ‌మానితో పాటు త‌న‌ను నిలువ‌రించేందుకు వ‌చ్చిన పోలీసుల‌పై బూతు పురాణం విప్పింది. అదుపులోకి తీసుకోవ‌డానికి య‌త్నించిన పోలీసులకు... ప‌ద్మ పిచ్చి ప్ర‌వ‌ర్త‌న‌తో చుక్క‌లు క‌నిపించాయి. తీరా ఎలాగోలా పోలీస్ స్టేష‌న్‌కు తీసుకుని వ‌స్తే... స్టేష‌న్‌లోకి అడుగుపెట్టేందుకు స‌సేమిరా అన్న ప‌ద్మ‌... కుర్చీ వేస్తే బ‌య‌టే కూర్చుంటాన‌ని, పోలీస్ స్టేష‌న్‌ లోకి వ‌చ్చేది లేద‌ని తేల్చి చెప్పారు. త‌న‌ను లోప‌లికి లాక్కెళ్లేందుకు య‌త్నించిన ఓ మ‌హిళా కానిస్టేబుల్‌ పై ప‌ద్మ శివంగిలానే విరుచుకుప‌డింది. నేల‌పై ఉన్న మ‌ట్టిని చేతిలోకి తీసుకుని ఆ కానిస్టేబుల్‌ పై విస‌ర‌డంతో పాటు ఎగిరి మ‌రీ ఆ కానిస్టేబుల్‌ పై దాడికి య‌త్నించింది. ఆ త‌ర్వాత ఆమెను ఎలాగోలా శాంతింప‌జేసిన పోలీసులు ప‌ద్మ కుటుంబ స‌భ్యుల‌కు స‌మాచారం అంద‌జేసి ఆమెను క్షేమంగానే వారికి అప్ప‌జెప్పారు.

ఇదంతా ఎక్క‌డ జ‌రిగిందంటే... కృష్ణా జిల్లా తిరువూరు మండ‌ల కేంద్రంలో. సిమెంట్ దుకార‌ణంలో కూర్చున్న ద‌గ్గ‌ర నుంచి రోడ్డుపై ప‌ద్మ హ‌ల్‌చ‌ల్ చేయ‌డం, ఆ త‌ర్వాత పోలీస్ స్టేష‌న్ లో వీరంగ‌మాడ‌టం, పోలీసుల‌పై దాడి చేయ‌డం త‌దిత‌ర అన్ని దృశ్యాల‌తో కూడిన ఓ వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తోంది. ఉద్యోగుల‌కు ఆద‌ర్శంగా నిల‌బ‌డ్డ ప‌ద్మ... ఇలా విచిత్రంగా ఎందుకు ప్ర‌వ‌ర్తిస్తోంద‌న్న ప్ర‌శ్న ఈ వీడియోను చూసిన ప్ర‌తి వ్య‌క్తిని తీవ్ర మ‌న‌స్తాపానికి గురి చేస్తోంది. అయినా నిన్న‌టిదాకా బాగానే ఉన్న ప‌ద్మ‌... ఇప్పుడు ఇలా విచిత్రంగా ఎందుకు మారిపోయింద‌న్న దానికి స‌మాధానం అయితే దొర‌క‌లేదు గానీ... ప‌ద్మ‌కు ఏదో బ‌ల‌మైన షాకే త‌గిలి ఉంటుంద‌ని, ఆ కార‌ణంగానే ఆమె ఇలా విచిత్రంగా మారిపోయి ఉంటుంద‌న్న భావ‌న మాత్రం వ్య‌క్తమ‌వుతోంది.



Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/