Begin typing your search above and press return to search.

నోవాటెల్ లో భ‌ర‌త్ 7 గంట‌లేం చేశాడు?

By:  Tupaki Desk   |   27 Jun 2017 5:33 AM GMT
నోవాటెల్ లో భ‌ర‌త్ 7 గంట‌లేం చేశాడు?
X
సినీన‌టుడు ర‌వితేజ సోద‌రుడు భ‌ర‌త్ రోడ్డు ప్ర‌మాదంలో మ‌ర‌ణించిన సంగ‌తి తెలిసిందే. ఈ ఉదంతానికి సంబంధించి ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాలు ఇప్పుడుబ‌య‌ట‌కు వ‌స్తున్నాయి. నోవాటెల్ లో జ‌రిగిన పార్టీలో పాల్గొన్న భ‌ర‌త్ రాత్రి తొమ్మిదిన్న‌ర గంట‌ల వేళ‌లో రిట‌ర్న్ అయిన‌ట్లుగా చెబుతున్నారు.

అయితే.. మ‌ధ్యాహ్నం మూడు గంట‌ల వేళ‌కే భ‌ర‌త్ నోవాటెల్ వ‌చ్చిన‌ట్లుగా పోలీసులు గుర్తించారు. నోవాటెల్‌ లో జ‌రిగిన పార్టీలో భ‌ర‌త్ పాల్గొన్న‌ట్లు చెబుతున్నా.. హోట‌ల్ లో ఒక గ‌ది తీసుకున్న‌ట్లుగా చెబుతున్నారు. శ‌నివారం మ‌ధ్యాహ్నం 2.30 గంట‌ల స‌మ‌యంలో నోవాటెల్ హోట‌ల్ ఎంట్ర‌న్స్ లో నుంచి లోప‌ల‌కు వెళుతున్న సీసీ కెమేరా ఫుటేజ్ ను పోలీసులు సేక‌రించారు.

పార్టీలో భ‌ర‌త్ తో పాటు పాల్గొన్న రాజు అనే అత‌న్ని పోలీసులు గుర్తించిన‌ట్లు చెబుతున్నారు. అత‌న్ని విచారిస్తే మ‌రిన్ని వివ‌రాలు తెలిసే అవ‌కాశం ఉందంటున్నారు. మ‌రోవైపు.. నోవాటెల్ లో ఉన్న ఏడు గంట‌లు భ‌ర‌త్ ఏం చేశాడో అన్న విష‌యాన్ని పోలీసులు బ‌య‌ట‌పెట్ట‌టం లేద‌ని స‌మాచారం. ఇదిలా ఉంటే మ‌రిన్ని ఆస‌క్తికర‌మైన విష‌యాలు బ‌య‌ట‌కు వ‌స్తున్నాయి.

యాక్సిడెంట్ జ‌రిగిన త‌ర్వాత రాత్రి 12 గంట‌ల స‌మ‌యంలో పోలీసులు ర‌వితేజ కుటుంబ స‌భ్యుల‌కు ఫోన్ చేసి చెప్పే ప్ర‌య‌త్నం చేసినా.. వాళ్లెవ‌రూ ఫోన్ రిసీవ్ చేసుకోలేద‌న్న మాట పోలీసు వ‌ర్గాల్లో వినిపిస్తోంది. భ‌ర‌త్ ను చూసేందుకు ర‌వితేజ రాక‌పోవ‌టం చ‌ర్చ‌గా మార‌గా.. గాయ‌ప‌డిన త‌న సోద‌రుడి ముఖాన్ని చూడ‌లేకే రాలేద‌ని.. త‌న‌ను అర్థం చేసుకోవాల‌ని చెప్ప‌టం తెలిసిందే. అయితే.. సోమ‌వారం ఓ సినిమా షూటింగ్‌ కు ర‌వితేజ హాజ‌రు కావటాన్ని కొంద‌రు ప్ర‌స్తావిస్తున్నారు. మొత్తంగా భ‌ర‌త్ యాక్సిడెంట్.. త‌ద‌నంత‌రం చోటు చేసుకున్న ప‌రిణామాలు చ‌ర్చ‌నీయాంశాలుగా మారాయి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/