Begin typing your search above and press return to search.
రూ.20 కోట్లు పెట్టి కుక్కను కొనుగోలు చేసిన నటుడు
By: Tupaki Desk | 7 Jan 2023 4:48 AM GMTరూ.20 కోట్లు. ఒక సామాన్యుడు తన జీవితకాలంలో ఈ భారీ మొత్తాన్ని సంపాదించే సీన్ ఉండదు. ఒక మధ్యతరగతి జీవికి కూడా రూ.20 కోట్లు అంత ఆషామాషీ కాదు. కానీ.. ఈ భారీ మొత్తంతో ఒక సినీ నటుడు ఒక శునకాన్ని కొనుగోలు చేయటానికి వెచ్చించటం అంటే మాటలా?
ఇంత భారీ మొత్తాన్ని పోసి కొనుగోలు చేసిన ఆ కుక్క స్పెషాలిటీ ఏమిటి? అన్నది ఒక ప్రశ్నగా మారింది. శాండిల్ వుడ్ కు చెందిన నటుడు ఒకరు ఇటీవల కొనుగోలు చేసిన కుక్క ఉదంతం వార్తాంశంగా మారింది.దీనికి కారణం.. ఆ కుక్కను సొంతం చేసుకోవటం కోసం సదరు నటుడు వెచ్చించిన మొత్తం అక్షరాల రూ.20కోట్లు.
అంత భారీ మొత్తం ఆ కుక్కకు పలకటానికి కారణం ఏమిటి? అన్నప్రశ్నకు సమాధానం వెతికితే.. అరుదైన జాతికి చెందినది కావటమే ఆ శునకం స్పెషాలిటీగా చెబుతున్నారు. కాకాసియస్ షెపెర్డ్ జాతికి చెందిన కుక్కను కన్నడ నటుడు.. ఇండియన్ డాగ్ బ్రీడర్ అసోసియేషన్ అధ్యక్షుడు సతీశ్ ఇటీవల ఒక కుక్కను కొనుగోలు చేశారు.
హైదరాబాద్ కు చెందిన ఒక అమ్మకందారు నుంచి తానీ కుక్కను కొనుగోలు చేసినట్లుగా పేర్కొన్నారు. ఏడాదిన్నర వయసున్న ఈ కుక్కకరు కాడాబామ్ హైడర్ అనే పేరును పెట్టుకున్నట్లుగా పేర్కొన్నారు. పది నుంచి పన్నెండేళ్లు జీవించే అవకాశం ఉన్న ఈ కుక్కలు ఎక్కువగా అర్మేనియా.. సర్కాసియా.. జార్జియా.. రష్యాలోని కొన్ని ప్రాంతాల్లో కనిపిస్తుంటాయని చెబుతున్నారు.
తాను కొనుగోలు చేసిన కుక్కతో కలిసి మహేశ్ ఒక ఫోటో దిగి.. దాన్ని సోషల్ మీడియాలో షేర్ చేశారు. తాను కొనుగోలు చేసిన మొత్తాన్ని ప్రస్తావించటంతో ఇప్పుడీ కుక్క టాపిక్ హాట్ టాపిక్ గా మారింది. మనలో మన మాట.. రూ.20కోట్లు పోసి కొన్న ఈ కుక్క కొనుగోలు వ్యవహారంలో జీఎస్టీ రూపంలో ప్రభుత్వానికి ఎంత వెళ్లి ఉంటుందంటారు?
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.