Begin typing your search above and press return to search.

మోడీ ఎంత మొన‌గాడో.. నాటి స్టార్ చెప్పేశాడు!

By:  Tupaki Desk   |   16 July 2019 8:11 AM GMT
మోడీ ఎంత మొన‌గాడో.. నాటి స్టార్ చెప్పేశాడు!
X
ఖ‌రీదైన డ్రెస్సు.. క‌ళ్ల‌కు వేలాది రూపాయిలు విలువ చేసే చ‌లువద్దాలు పెట్టుకొని స్టైల్ గా చీపురు పట్టుకొని చిమ్మిన బాలీవుడ్ డ్రీం గ‌ర్ల్ హేమ‌మాలిని చీపురుతో చిమ్మే వ్య‌వ‌హారం మీద వ‌చ్చిన విమ‌ర్శ‌లు అన్ని ఇన్నికావు. ప్ర‌ధాని మాన‌స పుత్రిక అయిన స్వ‌చ్ఛ భార‌త్ లో భాగంగా శుభ్రంగా ఉండే పార్ల‌మెంటు ఆవ‌ర‌ణ‌లో పెద్ద పెద్ద‌చీపుర్లు ప‌ట్టుకొని హేమ‌మాలిని అండ్ కో చిమ్మిన వైనంపై నెటిజ‌న్లు మాత్ర‌మే కాదు.. సాధార‌ణ ప్ర‌జ‌లు సైతం త‌ప్పు ప‌ట్టారు.

ఈ చిమ్ముడు వ్య‌వ‌హారానికి సంబంధించి ప‌లువురు వ్యంగ్య వ్యాఖ్య‌లు చేశారు. అంద‌రి కంటే ఎక్కువ‌గా విమ‌ర్శ‌ల‌కు గురైంది హేమ‌మాలినే. క‌ళ్ల‌జోడుతో కూడా చిమ్మొచ్చా? అన్న ఎట‌కారం చాలామంది నుంచి వ‌చ్చింది. ఇలాంటి వేళ‌.. చీపురు ప‌ట్టుకొని చిమ్మిన హేమ‌మాలిని విష‌యం మీద ఒక నెటిజ‌న్ వేసిన ప్ర‌శ్న‌కు అల‌నాటి సూప‌ర్ స్టార్ ధ‌ర్మేంద్ర ఆస‌క్తిక‌ర వ్యాఖ్య చేశారు.

త‌న భార్య (హేమ‌మాలిని) సినిమాల్లో మాత్ర‌మే చీపురు ప‌డుతుంద‌ని.. తానైతే చీపురుప‌ట్టి ఊడ్చ‌టంలో చిన్న‌ప్ప‌టి నుంచి స్పెష‌లిస్టున‌ని.. తానెప్పుడూ అమ్మ చేతిని ప‌ట్టుకునే ఉండేవాడిన‌ని చెప్పారు. శుభ్ర‌త‌ను తాను ఇష్ట‌ప‌డ‌తాన‌ని చెప్పిన ధ‌ర్మేంద్ర‌ మాట‌ల్నిచూస్తే.. హేమ‌మాలిని ఇంట్లో చీపురు ప‌ట్టుకున్న‌దే లేద‌న్న విష‌యం అర్థం కాక మాన‌దు. ఏమైనా.. రీల్ లో మాత్ర‌మే చీపురు ప‌ట్టే హేమమాలిని చేత రియ‌ల్ గా చీపురు ప‌ట్టించ‌టంలో మోడీ స‌క్సెస్ అయ్యార‌ని చెప్పాలి. మోడీనా మ‌జాకానా?