Begin typing your search above and press return to search.
వింత కథ : హీరోయిన్ కోసం చరిత్ర హీనుడిగా మారిన హీరో
By: Tupaki Desk | 10 April 2022 3:29 AM GMTసినిమాల్లో హీరోయిన్ ని విలన్స్ నుంచి కాపాడటం కోసం హీరో వీరోచిత పోరాటాలు చేస్తుంటారు. కానీ అలాంటి హీరోనే రియల్ లైఫ్ లో హీరోయిన్ కోసం విలన్‌గా మారడం ఇప్పడు సంచలనం సృష్టిస్తోంది. దక్షిణాదితో పాటు యావత్ దేశ వ్యాప్తంగా ఈ అంశం ప్రకంపణలు సృష్టించింది. 2017లో మలయాళ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఓ వెలుగు వెలుగుతున్న దిలీప్ , స్టార్ హీరోయిన్ భావన లైంగిక వేధింపుల కేసు గత కొన్నేళ్లుగా రసవత్తర మలుపులు తిరుగుతూ సినిమా ట్విస్ట్ లని తలపిస్తోంది.
సినిమా ఫక్కీలోనే ఈ కేసులో ట్విస్ట్ లు, టర్న్‌లు.. పగా.. ప్రతీకారాలు.. ఊహకందని లేడీ విలన్ లు వున్నారు. హీరోయిన్ పై పగతో హీరో దిలీప్ .. హీరోయిన్ భావన కోసం విలన్ గా మారడం.. అతని పగని సాధించడం కోసం మరో హీరోయిన్ కావ్య మాధవన్ ప్రతినాయకురాలిగా ప్లాన్ చేయడం సభ్య సమాజాన్ని విస్తూ పోయేలా చేస్తోంది. కొన్నేళ్ల క్రితం అంటే 2017లో అప్పటికే స్టార్ హీరోగా మలయాళ ఇండస్ట్రీలో స్టార్ స్టేటస్ ని అనుభవిస్తూ క్షణం తీరిక లేకుండా వరుస ప్రాజెక్ట్ లలో నటిస్తున్న హీరో దిలీప్ నటి భావనపై లైంగిన వేధింపులకు పాల్పడ్డాడని సంచలన ఆరోపణలు ఎదుర్కొన్నారు.
ఈ విషయం తెలిసి యావత్ సినీ ఇండస్ట్రీ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. హీరోయిన్ కోసం హీరో, హీరోయిన్ విలన్ లుగా మారడం సిపీ ప్రపంచాన్ని నివ్వెరపోయేలా చేసింది. దీంతో సదరు హీరోని అరెస్ట్ చేసి విచారణ మొదలు పెట్టిన కేరళ పోలీసులు ప్రస్తుతం కేసుని కీలక మలుపుకు తీసుకొచ్చి సంచలన విషయాలని ఒక్కొక్కటిగా బయటికి తీస్తున్నారు.
దీంతో యావత్ ప్రపంచం ఆశ్చర్యపోతోంది. భావన లైంగిక వేధింపుల కేసు కారణంగా గత కొంత కాలంగా జైలు జీవితాన్ని అనుభవిస్తున్నారు మలయాళ హీరో దిలీప్. ఈ కేసుని పరిశోధిస్తున్న కేరళ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు తాజాగా ఆసక్తికరమైన విషయాలని బయటపెట్టారు.
ముందు దిలీప్ ని అదుపులోకి తీసుకుని విచారించి అతన్ని జైలుకి పంపిన పోలీసులు తాజాగా మరిన్ని ఆసక్తికర విషయాలని వెలుగులోకి తీసుకొచ్చారు. ఇటీవల దిలీప్ బావ సూరజ్ కు కూడా ఈ కేసుతో సంబంధం వుందని అతనితో పాటు మరో ఇద్దరు అసిస్టెంట్ లని అదుపులోకి తీసుకున్న పోలీసులు తాజాగా ఈ కేసులో మరో ట్విస్ట్ ని బయటపెట్టి షాకిచ్చారు.
ఈ కేసులో దిలీప్ రెండవ భార్య, హీరోయిన్ కావ్య మాధవన్ హస్తం కూడా వుందని తేల్చారు. హీరోయిన్ భావన పై జరిగిన లైంగిన దాడి జరిగిన రోజున హీరోయిన్ కావ్య మాధవన్ తన అన్న సూరజ్ ఫోన్ నుంచి దిలీప్ కు మెసేజ్ లు చేసిందని, అంతే కాకుండా పక్కా ప్లాన్ ని ఆమె నిర్దేశించిందని క్రైమ్ బ్రాంచ్ పోలీసులు వెల్లడించారు.
అంతే కాకుండా భావనని కిడ్నాప్ ఎలా చేయాలో కావ్య మాధవన్ పక్కాగా ప్లాన్ వేసిందని, అందుకు సంబంధించిన వాయిస్ ని తాజాగా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందులో కావ్య మాధవన్, సూరజ్ , శరత్ ల మధ్య జరిగిన సంభాషణ మొత్తం క్లియర్ గా వినిపిస్తోందని సంచలన విషయాన్ని బయటపెట్టిన పోలీసులు తాజాగా కావ్య మాధవన్ ని కూడా అదుపులోకి తీసుకోవడం సంచలనంగా మారింది.
కావ్య మాధవన్, భావన మంచి స్నేహితులు. ఆ స్నేహాన్నే అడ్డుపెట్టుకుని భావనని తన ట్రాప్ లో పడేసింది. కావ్య ఫోన్ చేయడంతో తన మాటలు గుడ్డిగా నమ్మిన భావన కావ్య చెప్పిన చోటుకి ఒంటరిగా వెళ్లిందట. అక్కడే ప్లాన్ ని అమలు చేయడానికి రెడీగా వున్న కావ్య సోదరుడు సూరజ్ .. భావనని కిడ్నాప్ చేయడం, లైంగికంగా వేధించడం సంచలనంగా మారింది.
అయితే ఈ ఎంటైర్ ఎపిసోడ్ కి ప్రధాన కారణం బావనపై దిలీప్ పెంచుకున్న పగ, ప్రతీకారాలే అని తాజాగా పోలీసులు తేల్చారు. దిలీప్ హీరోయిన్ మంజు వారియర్ ని మొదట పెళ్లి చేసుకున్నాడు. అయితే సినిమాల్లో బిజీగా వున్న దిలీప్ కు మరో హీరోయిన్ కావ్య మాధవన్ తో ఎఫైర్ మొదలైంది. ఆ విషయం భావన ద్వారా తెలుసుకున్న మంజు వారియర్ తన భర్త దిలీప్ కు విడాకులు ఇచ్చేసి దూరంగా వుంటోంది.
ఆ తరువాత దిలీప్ నటి కావ్య మాధవన్ ని రెండవ వివాహం చేసుకున్నాడు. అయినా తమకు జరిగిన అవమానానికి ప్రతీకారం తీర్చుకోవాలని దిలీప్ - కావ్య మాధవన్ ప్లాన్ చేసుకున్నారట. అదను కోసం ఎదురుచూసిన దిలీప్, కావ్య మాధవన్ టైమ్ రాగానే భావన పై తమ పగని తీర్చుకున్నారని తెలుస్తోంది. పోలీసులు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేయడం ఇప్పుడు దేశ వ్యాప్తంగా ఈ కేసు సంచలనం సృష్టిస్తోంది. పగ కోసం హీరో, హీరోయిన్ మరో హీరోయిన్ కోసం విలన్ లుగా మారడం సినిమా కథని తలపించడం విశేషం.