Begin typing your search above and press return to search.
ప్రకాశ్ రాజ్ కు కన్నడ హీరో వార్నింగ్!
By: Tupaki Desk | 19 Feb 2018 4:45 PM GMTప్రముఖ కన్నడ జర్నలిస్ట్ గౌరీ లంకేశ్ హత్యానంతరం.....విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్.....బీజేపీ ప్రభుత్వం, ప్రధాని మోదీలపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తోన్న సంగతి తెలిసిందే. అదే రీతిలో ప్రకాశ్ రాజ్ పై బీజేపీ నేతలు - నాయకులు కూడా తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు. అయితే, తాజాగా ఓ ప్రముఖ నటుడు....ప్రకాశ్ రాజ్ పై మండిపడ్డారు. భారత ప్రధానిగా మోదీ అర్హుదా? అనర్హుడా? అని నటుడు ప్రకాష్ రాజ్ జస్ట్ ఆస్కింగ్ ...పేరుతో ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. ఆ ట్వీట్ కు ప్రముఖ హీరో - బీజేపీ నాయకుడు జగ్గేష్ ఘాటుగా సమాధానమిచ్చారు. ఇన్నాళ్లూ తమిళులకు సేవ చేసి....ఇప్పుడు కన్నడిగులకు సేవ చెయ్యడానికి వచ్చావా? అంటూ ప్రకాశ్ రాజ్ కు అదిరిపోయే ట్వీట్ చేశారు. ప్రధానిని ప్రశ్నించేందుకు ప్రకాశ్ రాజ్ కు ఉన్న అర్హతలు ఏమిటో చెప్పాలని మండిపడ్డారు.
ఏ మాత్రం అనుభవం లేని, రాజకీయ నాయకుడు, రాజనీతి శాస్ర్త విద్యార్థి కాని ప్రకాశ్ రాజ్ ....ప్రధానిపై కామెంట్లు చేయడం సరికాదన్నారు. ఇప్పటివరకు తమిళనాడు ప్రజలకు అన్యాయం జరిగిందన్న ప్రకాశ్ రాజ్ కు హఠాత్తుగా కన్నడిగులపై ప్రేమ ఎందుకు పుట్టిందో చెప్పాలన్నారు. ప్రకాశ్ రాజ్.....రాత్రికి రాత్రి జాతీయ నాయకుడు కావాలని, కేవలం పబ్లిసిటీ కోసేమే ఇటువంటి కామెంట్లు చేస్తున్నాడని జగ్గేష్ దుయ్యబట్టారు. సినీ రంగంలో అడుగుపెట్టే సమయానికి తన జీవితం ఎలా ఉందో ఒక సారి వెనక్కి తిరిగి చూసుకోవాలన్నారు. భారత పౌరుడిగా రాజ్యాంగం ప్రకారంప్రశ్నించే హక్కు, భావవ్యక్తీకరణ హక్కు అందరికీ ఉంటుందన్నారు. కానీ, కాంగ్రెస్ నాయకులను మెప్పించేందుకు - పబ్లిసిటీ కోసం నోటికొచ్చినట్లు ప్రశ్నించడం సరికాదన్నారు. ప్రకాశ్ రాజ్ తన వ్యాఖ్యలను ఆపకుంటే సాటి నటుడు అన్నది కూడా మరచిపోయి తగిన బుద్ది చెప్పవలసి వస్తుందన్నారు. ఈ వ్యాఖ్యలపై ప్రకాశ్ రాజ్ స్పందించాల్సి ఉంది.