Begin typing your search above and press return to search.
30 ఇయర్స్ ఇండస్ట్రీకి కీలక పదవి..వైసీపీలో జోష్ ఖాయమే
By: Tupaki Desk | 16 Feb 2019 4:14 AM GMT30 ఇయర్స్ ఇండస్ట్రీ....సినిమాల గురించి తెలిసిన వారందరికీ ఈ పదం కామెంట్ ఎవరిదో తెలుసు. సినీ నటుడు పృథ్వీరాజ్ తనదైన శైలిలో వ్యక్తీకరించిన ఈ పదం ఎంతో పాపులర్ అయింది. కృష్ణాజిల్లాకు చెందిన పృథ్వీ గత కొంతకాలంగా వైఎస్సార్ సీపీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నారు, పార్టీ నిర్వహించిన ప్రతి కార్యక్రమంలోనూ పాల్గొని సంఘీభావం తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయనకు కీలక పదవి దక్కింది. వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శిగా పృథ్వీరాజ్ నియమితులయ్యారు.
ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత - వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఇటీవల నిర్వహించిన సుదీర్ఘ పాదయాత్రలో కూడా పృథ్వీ పాల్గొన్నారు. దీంతో పాటుగా వైసీపీ ముఖ్యనేత - ఎంపీ విజయసాయిరెడ్డి తరఫున కూడా పలు కార్యక్రమాల్లో ఆయన భాగం అవుతున్నారు. తనదైన టైమింగ్ - రైమింగ్ తో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వైఫల్యాలను - ప్రజల సమస్యలను తరచూ ఎత్తిచూపుతున్నారు. ఇలా పార్టీ కార్యక్రమాల్లో క్రియాశీలంగా పాల్గొంటున్న పృథ్వీని పార్టీ రథసారథి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు పృథ్వీరాజ్ ను కీలక పదవిలో నియమించారు. ఈ మేరకు శుక్రవారం పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ప్రకటన విడుదల చేశారు. కాగా, త్వరలో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను సామాన్య ప్రజలకు తెలిసేలా వీధి నాటకాల ప్రదర్శనలు చేపడతామని ఇటీవల ప్రకటించారు. తాజా నియామకంతో కొత్త జోష్ తో పృథ్వీ వైసీపీకి మరింత ఊపును తెస్తారని భావిస్తున్నారు.