Begin typing your search above and press return to search.

కత్తి మహేశ్ కథ రేపు బయటపడనుందా?

By:  Tupaki Desk   |   17 Jan 2018 3:54 PM GMT
కత్తి మహేశ్ కథ రేపు బయటపడనుందా?
X
పవన్ కల్యాణ్‌తో మొదలుపెట్టి ప్రధానమంత్రి వరకు అందరిపైనా విమర్శలు చేస్తున్న కత్తి మహేశ్ గత చరిత్రను - ఆయన నైజాన్ని బయటపెట్టేందుకు కొందరు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కొందరు కత్తి స్వగ్రామానికి వెళ్లి ఆయన తండ్రిని కలవగా.. దాన్ని కత్తి తప్పు పట్టారు. తాజాగా ఏబీఎన్ చానల్ నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న నిర్మాత రాంకీ కత్తి మహేశ్‌ పై తీవ్ర ఆరోపణలు చేశారు. అంతేకాదు.. గురువారం ఇదే చానల్ ద్వారా కత్తికి సంబంధించిన మరిన్ని సంచలన విషయాలను బయటపెడతానని ఆయన ప్రకటించారు.
    
కత్తి మహేశ్ కి మాటలు చెప్పడంలో ప్రావీణ్యం ఉందే తప్ప పని చేతకాదని ఆయన విమర్శించారు. సినీ ఇండస్ట్రీకి కత్తి మహేశ్ చీడపురుగని - అమ్మాయిలకు మహేశ్ అసభ్యకరమైన మెసేజ్ లు పెట్టేవాడని - స్త్రీ లోలుడని ఆరోపించారు. అసలు - డైరెక్షన్ గురించి కత్తి మహేశ్ కు ఏం తెలియదని - అతనికి మాటలు చెప్పడం మాత్రమే తెలుసు తప్పా - చేతలు లేవని అన్నారు.
    
కత్తి మహేశ్ కు సంబంధించిన మరిన్ని సంచలన విషయాలను గురువారం బయటపెడతానని, అప్పటి వరకు పవన్ కల్యాణ్ అభిమానులు సంయమనం పాటించాలని ఆయన అన్నారు. దీంతో గజల్ శ్రీనివాస్ స్థాయిలో కాకపోయినా కత్తికి సంబంధించి కూడా ఏదో చీకటి కోణాలు రేపు బయటపడొచ్చన్న అంచనాలు మొదలయ్యాయి.