Begin typing your search above and press return to search.
ట్రైన్ బాత్రూమ్ లో నటుడి ఘనకార్యం
By: Tupaki Desk | 9 Jun 2017 7:00 AM GMTవరుస ఉగ్రదాడులతో యూరప్ ప్రజలు భయపడిపోతున్నారు. బాంబు.. కాల్పులు.. ఉగ్రవాదులు లాంటి పదాలు వింటేనే ఒక్కసారిగా ఉలిక్కిపడుతున్నారు. ఇదిలా ఉండగా ఒక నటుడి పుణ్యమా అని ఫ్రాన్స్ లోని మెట్రో ట్రైన్లో ప్రయాణిస్తున్న ప్రయాణికులు బెంబేలెత్తిపోయారు. ఆందోళన కలిగించి.. ఆపై అందరిని ముఖాల్లో నవ్వులు పూయించిన ఈ ఉదంతంలోకి వెళితే..
పర్షియాకు చెందిన 35 ఏళ్ల నటుడు ఒకరు మార్సెల్లీ నుంచి ప్యారిస్ వెళ్లే మెట్రో రైలెక్కాడు. ఒక హాలీవుడ్ చిత్రంలో అతడు నటిస్తున్నాడు. కాసేపటికి ట్రైన్ బాత్రూంలోకి వెళ్లిన అతడు.. తుపాకులు.. ఆయుధాలు అంటూ కొన్ని పదాల్ని ఇంగ్లిష్.. డచ్ లో పలకటంతో కంగారుపడ్డ ప్రయాణికులు.. ట్రైన్లో ఉగ్రవాది ఉన్నాడంటూ రైలు అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఒక్కసారిగా కలకలం రేగింది.
ఇదిలా ఉంటే.. బాత్రూంలో ఉండి డైలాగుల్ని ప్రాక్టీస్ చేస్తున్న నటుడు తన ఫ్లోలో తాను ఉంటూ బిగ్గరగా డైలాగులు చదువుతున్నాడు. దీంతో.. ప్రయాణికులు కంగారు పడింది నిజమేనని భావించిన రైలు అధికారి పోలీసులకు.. ఆర్మీకి సమాచారం అందించారు.
వెంటనే స్పందించిన వారు ప్యారిస్ లో హైఅలెర్ట్ ప్రకటించి.. రైల్లోనే అతడ్ని అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ కు తరలించారు. బాత్రూంలో తన మానాన తాను ఉంటే.. వచ్చిపోలీస్ స్టేషన్ కు తీసుకెళుతున్న తీరుతో బిత్తర పోయిన సదరు నటుడు.. తాను యాక్టర్ నని.. తాను తన సినిమా షూటింగ్ లో భాగంగా డైలాగుల్ని ప్రాక్టీస్ చేస్తున్నట్లుగా చెప్పారు.
డైలాగ్స్ ను అందరి ముందు బిగ్గరగా చదువుతూ ప్రాక్టీస్ చేస్తే ఇబ్బంది అవుతుందన్న ఉద్దేశంతో.. బాత్రూంలో ప్రాక్టీస్ చేస్తున్నానని చెప్పటం.. అతను చెప్పిన వివరాల్ని సరిగా ఉండటంతో అతడ్ని విచారించి వదిలేశారు. అందుకే అంటారు.. చుట్టూ పరిస్థితుల్ని చూసుకొని వ్యవహరించాలే కానీ.. మన ప్రపంచంలో మనం ఉంటే లేనిపోని సమస్యల్లో చిక్కుకుపోవటం ఖాయమన్న విషయం తాజా ఉదంతం మరోసారి రుజువు చేసిందని చెప్పాలి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/