Begin typing your search above and press return to search.
సల్మాన్ ను, ఆయన తండ్రిని చంపేస్తా: బెదిరింపు లేఖ కలకలం
By: Tupaki Desk | 6 Jun 2022 12:30 PM GMTప్రముఖ పంజాబీ సింగర్ సిద్ధూ మూస్ వాలా హత్య దేశంలో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. మే 29న కొందరు ఆగంతకులు కాల్పులు జరపడంతో ఈ పాపులర్ సింగర్ మృతిచెందాడు. అయితే పంజాబ్ పోలీసులు సెక్యూరిటీని ఉపసంహరించుకున్న మరుసటి రోజే ఈ ఘటన జరగడం విషాదం నింపింది.
గాయకుడికి పంజాబ్ ప్రభుత్వం సెక్యూరిటీ ఉపసంహరించకుంటే ఈ దారుణం జరిగి ఉండేది కాదని అంటున్నారు. ఈ తరుణంలో ప్రముఖ బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్, ఆయన తండ్రీ సలీంఖాన్ కు తాజాగా బెదిరింపు లేఖ రావడం సంచలనమైంది.
ప్రముఖ స్క్రిప్ట్ రైటర్ సలీంఖాన్ ఇటీవల ఉదయం వాక్ చేస్తుండగా మధ్యలో కొద్దిసేపు బ్రేక్ తీసుకున్నారు. ఆ సమయంలో బాంద్రా బ్యాండ్ స్టాండ్ వద్ద ఆయనకు ఈ చిట్ దొరికింది.
అనంతరం పోలీసులను కాంటాక్ట్ అయ్యారు. సిద్దూ మూస్ వాలా లాగే నిన్ను, నీ కుమారుడు సల్మాన్ కాన్ ను చంపుతామని అందులో ఉందని ఓ పోలీస్ ఆఫీసర్ తెలిపారు. ఈ విషయంపై పోలీసులు విలేకరులతో మాట్లాడారు.
ఈ బెదిరింపు లేఖను ఓ బెంచ్ లో సలీంఖాన్ భద్రతా సిబ్బంది కనుగొన్నారు. సలీఖాన్ తన భద్రతా సిబ్బందితో కలిసి మార్నింగ్ వాక్ చేయడానికి వెళ్లారు. ఆయన సాధారణంగా విశ్రాంతి తీసుకునే ప్రదేశం ఉంది. అక్కడ బెంచ్ మీద ఓ చిటీ రాసి ఉండడం గమనించాడు. అందులోనే సలీంను, సల్మాన్ ను చంపుతామని ఉంది.
ఈ విషయమై కేసు నమోదు చేసిన పోలీసులు బాంద్రా బస్ స్టాండ్ లోని సీసీటీవీ ఫుటేజీని తనిఖీ చేస్తున్నారు. దర్యాప్తులో భాగంగా స్థానికులను విచారిస్తున్నారు. సిద్దు మూస్ వాలా మరణం తర్వాత ఇలాంటి విషయాలను సీరియస్ గా తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.