Begin typing your search above and press return to search.
ఆ నటుడు రేప్ చేశారంటున్న మహిళ?
By: Tupaki Desk | 29 Dec 2017 1:33 PM GMTచిత్ర పరిశ్రమ ఇమేజ్ అంతకంతకూ మసకబారే పరిణామాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. గతంలో మాదిరి తమకు అన్యాయం జరిగితే బయటకు వచ్చేందుకు భయపడే తీరుకు భిన్నంగా.. ధైర్యంగా తమకు జరిగిన అన్యాయాన్ని బయటకు చెప్పటమే కాదు.. తమకు జరిగిన అన్యాయానికి న్యాయం జరిగే వరకూ పోరాడుతున్న వైనం ఇటీవల కాలంలో ఎక్కువగా కనిపిస్తోంది.
ఈ మధ్యన సినీ రంగానికి సంబంధించి పలు అత్యాచార ఉదంతాలు తెర మీదకు వస్తున్న వేళ.. తాజాగా కన్నడ సినీ రంగానికి చెందిన ఒక నటుడు తనను అత్యాచారం చేశారంటూ ఒక సాధారణ యువతి చేసిన ఆరోపణ ఇప్పుడు సంచలనంగా మారింది. కన్నడ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిన ఈ ఉదంతంలోకి వెళితే..
హెంబణ్ణ చిత్రంతో శాండల్ వుడ్ లో మంచి గుర్తింపు పొందిన నటుడు సుబ్రహణ్య. ఇటీవల కాలంలో నటుడిగా ఎదిగిన అతగాడు తనను అత్యాచారం చేసినట్లుగా 23 ఏళ్ల యువతి ఆరోపిస్తున్నారు. బసవగుడి పోలీస్ స్టేషన్లో ఆమె ఇచ్చిన ఫిర్యాదును పోలీసులు విచారిస్తున్నారు.
రాజాజీ నగర్ లో ఉండే సదరు యువతి తీర్తహళ్లిలో ఉండే సుబ్రమణ్యతో రెండేళ్ల క్రితం ప్రేమలో పడ్డారు. ఆమెను తాను పెళ్లి చేసుకుంటానని సదరు యువతి ఇంట్లో సుబ్రహణ్య ఒప్పించాడు. తన చిత్రం హెంబణ్ణ విడుదలకు సిద్ధంగా ఉన్న వేళ.. సినిమా విడుదల అయ్యాక పెళ్లి చేసుకుంటానని.. అప్పటివరకూ వాయిదా వేయాలని కోరారు. అందుకు యువతి పేరెంట్స్ ఓకే అన్నారు. ఇదిలా ఉండగా.. హెంబణ్ణ మూవీ రిలీజ్ కావటమే కాదు.. విజయవంతం కావటంతో పెళ్లి ప్రపోజల్ మరోసారి తెర మీదకు వచ్చింది.
అయితే.. తాను కొత్త ఇంట్లోకి గృహప్రవేశం చేయనున్నట్లుగా చెప్పి.. పెళ్లి వ్యవహారాన్ని మరోసారి వాయిదా వేశాడు. దీనికి సదరు యువతి తల్లిదండ్రులు సరేనన్నారు. ఇలా ఇరు కుటుంబాల మధ్య చక్కటి సంబంధాలు సాగుతున్నవేళ.. ఊహించని పరిణామం చోటు చేసుకున్నట్లుగా సదరు యువతి ఆరోపించింది.
నవంబరు ఒకటో తేదీన తన సోదరి ఇంటికని సదరు యువతిని తీసుకెళ్లిన సుబ్రహణ్య.. తన సోదరి ఇంటికి కాకుండా వేరే ఇంటికి తీసుకెళ్లాడట. అక్కడ కూల్ డ్రింక్ లో మత్తుమందు కలిపి ఇవ్వటం.. ఆమె స్పృహ కోల్పోయిన తర్వాత తనపై అత్యాచారం చేసినట్లుగా సదరు యువతి ఆరోపిస్తోంది. పెళ్లి విషయం మీద నిలదీస్తే.. తనను ఇప్పుడు బెదిరిస్తున్నాడని పేర్కొంది. తనని వదిలిపోవాలని.. లేనిపక్షంలో యాసిడ్ దాడి చేస్తానని హెచ్చరిస్తున్నట్లుగా పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది.
తన సినిమాకు ఒక యువతి రూ.20లక్షల మొత్తాన్ని పెట్టుబడి పెట్టిందని.. ఆమెనే తాను పెళ్లి చేసుకుంటానని చెప్పినట్లుగా సదరు యువతి పేర్కొంది. ప్రస్తుతం ఆమె ఫిర్యాదును విచారణకు స్వీకరించిన పోలీసులు ఎఫ్ ఐఆర్ ను నమోదు చేసింది సుబ్రహణ్యను అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. పోలీసులకు సదరు యువతి ఫిర్యాదు చేయటంతో.. నటుడు పరారీలో ఉన్నట్లుగా తెలుస్తోంది.