Begin typing your search above and press return to search.

లైవ్ లో శివాజీ రంకుపురాణం - బూతుల‌దండ‌కం!

By:  Tupaki Desk   |   5 Jan 2020 7:20 AM GMT
లైవ్ లో శివాజీ రంకుపురాణం - బూతుల‌దండ‌కం!
X
వార్తా చాన‌ళ్లు పెట్టాల‌న్నా భ‌య‌పెట్టేస్తూ ఉన్నారు వీళ్లంతా. ఇప్ప‌టికే టీవీ చాన‌ళ్ల చ‌ర్చాకార్య‌క్ర‌మంలో ప‌లువురు త‌మ థ‌ర్డ్ గ్రేడ్ మాట‌ల‌తో జ‌నాల‌ను భ‌య‌పెడుతూ ఉన్నారు. ఎన్నిక‌ల స‌మ‌యంలో కొంద‌రు తెలుగుదేశం నేత‌లు, ఆ పార్టీ అనుకూలురు బూతుల‌తో చెల‌రేగిపోయారు. ఇక ఇప్పుడు రాజ‌ధాని గొడ‌వ‌లో కూడా తెలుగుదేశం బ్యాచ్ ఇదే త‌ర‌హాలో రెచ్చిపోతూ ఉంది. అమ‌రావ‌తి మాత్ర‌మే రాజ‌ధానిగా ఉండాల‌ని డిమాండ్ చేసే వాళ్లు కొంద‌రు నిర్ల‌జ్జ‌గా బూతులు మాట్లాడ‌టానికి తెగించేస్తూ ఉన్నారు.

ఈ జాబితాలో చేరాడు న‌టుడు శివాజీ. ఆయ‌న అనుకూల చాన‌ల్ ఒక దాంట్లో శివాజీ మాట్లాడిన బూతులు వెబ్ లో వైర‌ల్ గా మారాయి. ఆ చాన‌ల్ లో శివాజీ అమ‌రావ‌తి గొప్ప‌ద‌నం గురించి చెప్పుకొచ్చారు. అదే స‌మ‌యంలో ఒక కాల‌ర్ ఒక‌రు శివాజీపై విరుచుకుప‌డ్డారు. త‌న‌ది గుంటూరు అని, త‌న‌దీ శివాజీదీ ఒకే ఊరు అని చెప్పిన ఆ కాల‌ర్.. శివాజీ వ‌య‌సులో ఉన్న‌ప్పుడు త‌న చెల్లెలు వ‌ర‌స అయ్యే అమ్మాయితో లేచిపోయాడ‌ని, ఏ మాత్రం విలువ‌ల్లేని అలాంటి వ్య‌క్తిని లైవ్ లోకి తీసుకురావొద్ద‌ని ఆ కాల‌ర్ వ్యాఖ్యానించాడు.

గ‌తంలో కూడా శివాజీ మీద సోష‌ల్ మీడియాలో ఈ త‌ర‌హా ప్ర‌చారం జ‌రిగింది. త‌న పిన్ని కూతురును ఎవ‌రినో శివాజీ తీసుకెళ్లిపోయాడ‌నే టాక్ న‌డిచింది. ఆ విష‌యాన్ని ఆ కాల‌ర్ ప్ర‌స్తావించాడు. దీంతో శివాజీ తీవ్రంగా స్పందించాడు. ఆకాల‌ర్ ను దుర్భాష‌లాడాడు ఈ న‌టుడు. *లం.కొడ‌కా..* అంటూ శివాజీ రెచ్చిపోయాడు. అది వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ ప‌నే అంటూ శివాజీ ట‌క్కున ఆరోపించ‌డం గ‌మ‌నార్హం. వైసీపీ ఆఫీసు నుంచినే ఆ కాల్ వ‌చ్చేసింద‌ని ఏదో కాల‌జ్ఞానిలా మాట్లాడాడు శివాజీ. త‌న గురించి ఎవ‌రో ఏదో మాట్లాడితే శివాజీ అలా వైసీపీకి లింకు పెట్టాడు.

అంతే కాదు.. శివాజీ త‌న రంకు పురాణాన్ని కూడా చెప్ప‌కొచ్చాడు. త‌ను వేరే ఎవ‌రి భార్య‌తోనో అమెరికాలో లంచ్ కు వెళ్లిన‌ట్టుగా శివాజీ నోటికొచ్చింది మాట్లాడాడు. కాల‌ర్ మాట్లాడిన దానితో పోలిస్తే శివాజీ మ‌రింత దారుణంగా, చెత్త‌గా, నీఛంగా మాట్లాడాడు. బూతులు తిడుతూ రెచ్చిపోయాడు. టీవీ పెట్టాలంటేనే భ‌య‌పెట్టేలా మాట్లాడాడు ఈ న‌టుడు.