Begin typing your search above and press return to search.
హోదా కోసం ఆమరణ దీక్ష చేసేస్తాడట!
By: Tupaki Desk | 14 March 2018 5:13 AM GMTఏపీ రాజకీయం వేడెక్కింది. ఎవరికి వారు ఏపీకి ప్రత్యేక హోదా కోసం ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. కేంద్రం మీద ఒత్తిడి తెచ్చేందుకు.. ఏపీ ప్రజల మనసుల్లో మైలేజీ పెంచుకునేందుకు కిందామీదా పడుతున్నారు. అధికార.. విపక్షాలతో పాటు జనసేన అధినేత సైతం విభజన హామీల అమలు కోసం కేంద్రంపై ఒత్తిడిని పెంచే ప్రయత్నం చేస్తున్నారు.
ఇప్పటికే పార్లమెంటులో నిరసనలతో తమ వాణిని వినిపిస్తున్న వారికి.. మరొకరు తోడయ్యారు. ఆ మధ్యన ప్రత్యేక హోదా కోసం కాస్తంత హడావుడి చేసిన సినీ నటుడు శివాజీ తర్వాత కనిపించలేదు.
ఏపీకి హోదా ఇవ్వాలంటూ పలు నిరసనలతో పాటు.. కొన్ని మీడియా సంస్థలతో ప్రచారాన్ని నిర్వహించిన ఆయన ఒకదశలో నిరసన దీక్షను చేపట్టారు. అతడి దీక్షను ప్రభుత్వం భగ్నం చేసి ఆసుపత్రికి చేర్చటంతో ఆ ఎపిసోడ్ ముగిసింది. హోదా సాధన కోసం పవన్ కల్యాణ్ తెర మీదకు రావాలని.. ఆయన ముందుండి హోదా ఉద్యమాన్ని నడిపించాలన్న అభిలాషను వ్యక్తం చేసిన వారిలో శివాజీ ఒకరు.
తర్వాత ఏమైందో ఏమో కానీ కనిపించటం మానేశారు. ఆయన సన్నిహితులు చెప్పే దాని ప్రకారం గడిచిన కొంతకాలంగా విదేశాల్లో ఉన్న ఆయన ఈ మధ్యనే తిరిగి వచ్చేశారు. రావటంతోనే హోదా సాధన మీద గళం విప్పిన ఆయన తాజాగా కీలక ప్రకటన చేశారు. ఈసారి పార్లమెంటు సమావేశాల్లో ప్రత్యేక హోదాను ప్రకటించని పక్షంలో ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని ఆయన వెల్లడించారు. ఏపీకి పదేళ్లు ప్రత్యేక హోదా ఇస్తానని మోసం చేసిన మోడీకి వచ్చే ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉందని ఆయన పిలుపునిచ్చారు.
పార్లమెంటు సమావేశాలు ముగిసే లోపు ప్రత్యేక హోదా ప్రకటనపై సానుకూల ప్రకటన రాని పక్షంలో ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని చెబుతున్న శివాజీతో పాటు వామపక్ష నేతలు.. హోదాపై మొదటి నుంచి తన వాదనను వినిపిస్తున్న ప్రత్యేక హోదా సాధన సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. మొత్తంగా చూస్తే.. మరికొన్ని రోజుల్లో శివాజీ ఆమరణదీక్ష తెరపైకి రానుందని చెప్పక తప్పదు.