Begin typing your search above and press return to search.
బాబును బాబ్లీ ట్రాప్ లో పడొద్దన్న శివాజీ!
By: Tupaki Desk | 15 Sep 2018 5:48 AM GMTసమాచారం ఎక్కడి నుంచి వస్తుందో.. సోర్సు ఏమిటో కానీ టాలీవుడ్ సినీ నటుడు.. కొద్దికాలంగా రాజకీయాల గురించి సంచలన వ్యాఖ్యలు చేస్తున్న నటుడు శివాజీ తాజాగా మరిన్ని ఆసక్తికరవ్యాఖ్యలు చేస్తున్నారు. ఆపరేషన్ గరుడ పేరుతో భారీ కుట్రకు స్కెచ్ వేసినట్లుగా చెబుతున్న ఆయన.. బాబును ఉద్దేశిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
రానున్న రోజుల్లో చంద్రబాబుకు జాతీయ దర్యాప్తు సంస్థ నుంచి మరో రెండు నోటీసులు రానున్నట్లుగా వెల్లడించి విస్మయానికి గురి చేశారు. బాబుకు నోటీసులు జారీ చేసేందుకు అన్ని ఏర్పాట్లు జరిగిపోయాయని.. వీటితో బాబుకు చెక్ పెడతారన్నారు.
ఐదు నెలల క్రితమే తాను ఆపరేషన్ గరుడ గురించి చెప్పానని.. దాన్ని ఇప్పుడు అమలు చేస్తున్నట్లుగా వెల్లడించారు. ఈ ఆపరేషన్ లో భాగంగానే బాబ్లీ ఉదంతంలో బాబుకు నోటీసులు వచ్చినట్లుగా చెప్పారు. ఈ వారెంట్ అంతా ఒక ట్రాఫ్ అని.. తన సూచన ఏమంటే.. బాబును కోర్టుకు వెళ్లకుండా ఉండటమే మంచిదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కోర్టుకు హాజరు కాకుండా న్యాయబద్ధంగా ఈ వారెంట్ ను ఎదుర్కోవాలన్న సూచన చేశారు.
అంతేకాదు.. బాబు తరచూ వినియోగించే ప్రైవేట్ జెట్లలో ప్రయాణం ఏ మాత్రం మంచిది కాదన్నారు. తన సలహాను అనుసరించి బాబు ప్రైవేటు జెట్లలో ప్రయాణాన్ని విరమించుకోవాలన్నారు. బీజేపీ వారికి పదవీ వ్యామోహం బాగా పెరిగిపోయిందని.. ఎంతటికైనా దిగజారేలా బీజేపీ తయారైందన్నారు. త్వరలో బాబుకు మరిన్ని నోటీసులు రావటం ఖాయమన్న శివాజీ మాటల్లో నిజం ఎంతన్నది పక్కన పెడితే.. ఆయన మాటల్ని బాబు సీరియస్ గా తీసుకుంటారా? అన్నది ఇప్పుడో ప్రశ్నగా మారిందని చెప్పక తప్పదు.