Begin typing your search above and press return to search.
వారి కోసం సినిమాల్ని వదిలేస్తానంటున్న సుమన్
By: Tupaki Desk | 31 Dec 2017 5:02 AM GMTసినీ అభిమానులందరికి సుపరిచితుడైన సీనియర్ సినీ నటుడు సుమన్ ఆసక్తికర ప్రకటన చేశారు. బీసీల కోసం.. వారి హక్కుల కోసం పోరాడేందుకు తాను సిద్ధంగా ఉన్నానని చెప్పారు. అవసరమైతే.. తాను సినీ రంగాన్ని సైతం వదులుకునేందుకు సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. బీసీ విద్యార్థుల గర్జన కార్యక్రమంలో పాల్గొన్న సుమన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
బీసీ విద్యార్థుల్ని కలుసుకోవాలనే ఉద్దేశంతోనే తానీ సభకు వచ్చినట్లుగా చెప్పిన సుమన్.. తెలంగాణ గడ్డపై తొలిసారి బీసీల సభలో పాల్గొన్నానని చెప్పారు. పార్లమెంటులో బీసీ బిల్లు కోసం ఎంపీలంతా కృషి చేయాలని పిలుపునిచ్చారు. బీసీ జాతి అభ్యున్నతి కోసం ఎజెండాను సిద్ధం చేయాలన్నారు.
తన ప్రసంగంలో భాగంగా ఆసక్తికరమైన ప్రతిపాదనను తెర మీదకు తెచ్చారు సుమన్. ఉత్తరాది.. దక్షిణాది అన్న బేధం పోవాలంటే బీసీలకు ఉప ప్రధానమంత్రి పదవిని ఇవ్వాలన్న సూచనను తెచ్చారు. చదువుతోనే బీసీల అభివృద్ధి సాధ్యమని.. చదువు ఒక ఆయుధంగా ఆయన అభివర్ణించారు. బీసీలంతా బాగా చదువుకోవాలని పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తలుచుకుంటే బీసీలకు న్యాయం జరుగుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా కేసీఆర్ పై పొగడ్తల వర్షం కురిపించారు. ముస్లింను ఉప ముఖ్యమంత్రి చేసిన ఘనత కేసీఆర్‌దేనని.. సినిమా పరిశ్రమతో సంబంధం లేకుండా బీసీల అభివృద్ధి కోసం తన వంతుగా ప్రయత్నం చేస్తానన్నారు. బీసీల అభ్యున్నతికి అవసరమైతే సినిమాలు వదిలేసి మరీ పోరాడేందుకు సిద్ధమన్నారు. సుమన్ తీరుచూస్తుంటే.. బీసీల అభ్యున్నతితో పాటు.. కేసీఆర్ ను పొగిడేస్తూ.. తనకేం కావాలన్న విషయాన్ని చెప్పకనే చెప్పేస్తున్నట్లుగా అనిపించట్లేదు?