Begin typing your search above and press return to search.
స్వార్థం కోసం మతాల్లో చిచ్చు పెడుతున్నారుః సుమన్
By: Tupaki Desk | 4 March 2021 12:30 AM GMTస్వార్థ ప్రయోజనాల కోసం కొందరు మతాల మధ్య చిచ్చు పెడుతున్నారని, ఆ విధంగా అన్నదమ్ముల్లా మెలగాల్సిన ప్రజలను విడదీయడం సరికాదని ప్రముఖ సినీ నటుడు సుమన్ అన్నారు. తాజాగా ఆయన ఓ మీడియా సంస్థతో మాట్లాడారు. ఎవరి మత విశ్వాసాలు వారికి గొప్పగా ఉంటాయని, మన మతం కోసం ఇతర మతస్తుల మనోభావాలను దెబ్బతీసే విధానాలు సరికాదన్నారు. అన్ని మతాల వారు పక్కపక్కనే పూజలు చేసుకునే గొప్ప విధానం మనదేశంలో మాత్రమే ఉందన్నారు సుమన్.
ఇక, ప్రస్తుత రాజకీయాలపైనా తన అభిప్రాయం వెల్లడించారు సుమన్. ఈ రోజుల్లో సినీనటులు ముఖ్యమంత్రలు కావడం కష్టమేనని అన్నారు. ఎన్టీఆర్, ఎంజీఆర్, జయలలిత రాజకీయాల్లోకి వచ్చినప్పటి పరిస్థితులు వేరుగా ఉన్నాయని చెప్పారు. అప్పుడు వారిని ప్రజలంతా ఆమోదించారని, ఇప్పుడు అలాంటి పరిస్థితులు లేవని అన్నారు సుమన్.
ఇంకా లోతుగా మాట్లాడుతూ.. ప్రజలను రాజకీయ పరంగా సంతృప్తి పరచడం అంత తేలికైన పనికాదన్నారు. ఎన్ని సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినా.. వారిని పూర్తిస్థాయిలో మెప్పించడం ఎప్పుడూ కత్తిమీద సాము వంటిదేనని చెప్పారు. ప్రజలు లంచాలు ఇవ్వకుండా సేవలు పొందే పాలనే అన్నింటికన్నా ఉత్తమమైందనిసుమన్ అన్నారు.