Begin typing your search above and press return to search.
వ్యాపారవేత్తపై జీనత్ అమన్ రేప్ కేసు!
By: Tupaki Desk | 23 March 2018 6:41 PM GMTప్రస్తుతం సమాజంలో సామాన్యులతో పాటు సెలబ్రిటీల, సినీ తారలు కూడా లైంగిక వేధింపుల బాధితులే. ప్రస్తుతం సినిమాల్లో నటిస్తున్న కొందరు నటీమణులపై లైంగిక వేధింపుల ఘటనల గురించి వార్తల్లో మనం వింటూనే ఉన్నాం. అందుకు భిన్నంగా, ఓ వ్యక్తిపై అలనాటి బాలీవుడ్ అందాల తార జీనత్ అమన్ రేప్ కేసు పెట్టారు. ముంబైకి చెందిన సర్ఫరాజ్ (38) అనే వ్యాపార వేత్త తనను లైంగికంగా వేధించాడని జుహు పోలీస్ స్టేషన్లో గురువారం సాయంత్రం ఆమె రేప్ కేసు పెట్టారు. ఆమె ఫిర్యాదుపై స్పందించిన పోలీసులు సర్ఫరాజ్ ను గురువారం రాత్రి అరెస్టు చేశారు.
అతడిని ఈ రోజు లోకల్ కోర్టులో ప్రవేశ పెట్టారు. ప్రస్తుతం ఈ కేసును క్రైమ్ బ్రాంచి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
2010 నుండి 2015 మధ్య సర్ఫరాజ్, జీనత్ అమన్ ల మధ్య వివాదం ఉంది. జీనత్ కు చెందిన రూ.15 కోట్ల విలువ చేసే నగలను తనకివ్వాలని సర్ఫరాజ్ డిమాండ్ చేసినట్లు ఆరోపణలున్నాయి. అందుకు, జీనత్ నిరాకరించడంతో ముంబైలో ఆమెకు చెందిన 5 ప్లాట్లను ఫోర్జరీ పేపర్లు క్రియేట్ చేసి సర్ఫరాజ్ తన పేరుతో రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. అంతేకాకుండా, సర్ఫరాజ్.....ఫేక్ మ్యారేజ్ పేపర్లు సృష్టించి జీనత్ ను బెదిరించినట్లు కూడా వార్తలు వచ్చాయి. ఈ ఏడాది జనవరిలో కూడా సర్ఫరాజ్ తనను లైంగికంగా వేధించాడని జీనత్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనను చాలా కాలంగా సర్ఫరాజ్ వేధిస్తున్నట్లు జీనత్ ఆరోపించారు. తాజా ఫిర్యాదుతో సర్ఫరాజ్ పై ఐపిసీ 376, 420, 406, 465, 467, 468, 469, 471, 506 సెక్షన్ల కింద కేసు నమోదైంది.