Begin typing your search above and press return to search.

మహిళా ఫ్యాషన్ డిజైనర్ తో ప్రేమలో సినీ నటీ ఎఫైర్ బయటపెట్టిన పత్రికపై విమర్శలు

By:  Tupaki Desk   |   14 Jun 2022 2:30 PM GMT
మహిళా ఫ్యాషన్ డిజైనర్ తో ప్రేమలో సినీ నటీ ఎఫైర్ బయటపెట్టిన పత్రికపై విమర్శలు
X
ప్రముఖ హాలీవుడ్ సినీ నటి రెబెల్ విల్సన్ కు ఒక మహిళతో కొత్త సంబంధం గురించి ఆస్ట్రేలియా వార్తాపత్రిక 'సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్' రాసిన కథనాలపై తీవ్ర దుమారం చెలరేగింది. ఆ పత్రికను తప్పుపడుతూ విమర్శలు వెల్లువెత్తాయి. రెబల్ విల్సన్ తనకు తన డిస్నీ ప్రిన్సెస్ దొరికినట్లు చెబుతూ తన కొత్త భాగస్వామితో సెల్ఫీని శుక్రవారం ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది.

ఒక లేడీ హీరోయిన్ మరో లేడీ ఫ్యాషన్ డిజైనర్ తో ఎఫైర్ పెట్టుకోవడాన్ని పత్రిక తప్పుగా చూపించింది. వీరి సంబంధం గురించి ప్రపంచానికి తెలియక ముందే తమకు తెలుసునని.. దీనిపైవ్యాఖ్యానించాల్సిందిగా విల్సన్ కు రెండు రోజులు సమయం ఇచ్చామని చెబుతూ సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్ శనివారం ఒక కథనం రాసింది. ఆ సంబంధం గురించి బయటకు చెప్పాల్సిందిగా పత్రిక ఒత్తిడి తెచ్చిందని ఆరోపణలు వచ్చాయి.

పత్రిక మీద సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి. వ్యక్తులు తమ సంబంధాలను బయటకు చెప్పాలని ఒత్తిడి చేయడం ఆమోదనీయం కాదని ఎల్.జీబీటీక్యూ ప్లస్ ఉద్యమకారులు మండిపడ్డారు. ఆస్ట్రేలియా నటి రెబల్ విల్సన్ వయసు 42 సంవత్సరాలు. బ్రైడ్స్ మెయిడ్స్, పిచ్ పెర్ఫెక్ట్ తదితర సినిమాల్లో నటించారు. ఆమె తన సంబంధం గురించి వెల్లడించడం ఆమె ఇష్ట ప్రకారం జరగలేదని.. దానిని బయటపెడుతామంటూ సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్ ఆమెకు రెండు రోజుల గడువు ఇచ్చి ఆమెపై ఒత్తిడి తెచ్చారని.. ఇది దారుణమని అభివర్ణించింది.

దీనికి రెబెల్ విల్సన్ బదులిచ్చింది. 'ఇది చాలా కష్టమైన పరిస్థితి కానీ గౌరవప్రదంగా వ్యవహరించడానికి ప్రయత్నిస్తున్నా' అంటూ ట్వీట్ చేశారు. లీజర్ వేర్ డిజైనర్ రమోనా అగ్రుమాతో తన సంబంధం గురించి విల్సన్ చేసిన పోస్ట్ కు అభిమానులు,స్నేహితులు, ప్రముఖుల నుంచి అభినందనలు వెల్లువెత్తాయి. ఆ పోస్టుకు 17 లక్షలకు పైగా లైకులు వచ్చాయి.

ఇక తీవ్ర విమర్శలు రావడంతోనే సిడ్నీ మార్నింగ్ పత్రిక స్పందించింది. 'వారిద్దరి సంబంధం గురించి తమ పత్రికకు ముందే తెలుసు అని.. గురువారం ఉదయం రెబల్ విల్సన్ ప్రతినిధిని తమ పత్రిక ఎంతో జాగ్రత్తతో గౌరవంతో సంప్రదించిందని ఈ అంశంపై వ్యాఖ్యానించాలని కోరిందని పేర్కొన్నారు.

ప్రపంచంలో సెలబ్రెటీల స్వలింగ సంబంధాలను బయటకు చెప్పడం అనేది 2022లో అనవసరమైన విషయంగా ఉండాలి. ప్రేమ అంటే ప్రేమే అని పేర్కొన్నారు. దీంతో పత్రికపై విమర్శలు.. ఆ జంటపై సోషల్ మీడియాలో మద్దతు వెలువడుతోంది.