Begin typing your search above and press return to search.
ఏపీలో సినీ నటి అపూర్వ భూమి కబ్జా!
By: Tupaki Desk | 5 Jun 2018 7:39 AM GMTఏపీలో ఇటీవల కాలంలో కబ్జాలు ఎక్కువ అయ్యాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొంతకాలం క్రితం వైజాగ్ లో భూముల కబ్జాలపై ఏపీ అధికారపక్ష నేతల మధ్యన జరిగిన వాదనను మర్చిపోలేం. అధికారపక్షానికి చెందిన నేతలు విశాఖలో కబ్జాలకు నువ్వు కారణం అంటే నువ్వే కారణమని బాహాటంగా విమర్శలు చేసుకున్నారు. ఇదిలా ఉంటే.. తెలుగు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పలు చిత్రాల్లో నటించిన నటి అపూర్వకు చెందిన భూమిని కబ్జాకు ప్రయత్నిస్తున్నారన్న ఫిర్యాదు ఇప్పుడు సంచలనంగా మారింది.
తమ పొలాన్ని కబ్జా పెట్టటం వెనుక రాజకీయ నేతల హస్తం ఉందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తూ.. తెలుగువారికి సుపరిచితురాలైన అపూర్వకు పశ్చిమగోదావరి జిల్లా దెందులూరులో నాలుగు ఎకరాల పొలం ఉంది. ఈ పొలానికి సంబంధించిన సరిహద్దు రాళ్లను తొలగించటంపై వివాదం నడుస్తోంది.
ఈ కబ్జా వెనుక రాజకీయ నాయకుల ప్రమేయం ఉందన్న మాట వినిపిస్తోంది. అయితే.. అలాంటిదేమీ లేదని.. సరిహద్దు రాళ్లను తొలగిస్తున్న వివాదం ఉన్నదే తప్పించి మరింకేమీ లేదన్న మాటను పోలీసు వర్గాలు చెబుతున్నాయి. అయితే.. అపూర్వ కుటుంబ సభ్యుల మధ్య వివాదమే తప్పించి మరేమీ లేదన్న మాటను చెబుతున్నారు. కొంతకాలంగా ఈ వివాదం ఉందని.. అధికారుల సమక్షంలో పలుమార్లు సరిహద్దు రాళ్లు వేసినా.. రైతులు వాటిని తొలగిస్తున్నారని.. తన పొలంలోకి ఎలా ఆడుగు పెడతారంటూ బెదిరింపులకు దిగుతున్నట్లుగా అపూర్వ ఆరోపిస్తున్నారు.
తాజాగా స్థానిక వీఆర్వో సహకారంతో పొలంలో సరిహద్దు రాళ్లు వేయించినప్పటికీ కాసేపటికే వాటిని రైతులు తొలగించటం గమనార్హం. సరిహద్దు రాళ్లను తొలగించటమే కాదు.. తనను తిడుతున్నారంటూ అపూర్వ పోలీసులను ఆశ్రయించారు. తనకు న్యాయం చేయాలని ఆమె కోరారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. తనకు న్యాయం జరగని పక్షంలో.. జరిగిన విషయాలన్నీ బయట పెడతానంటూ ఆమె వ్యాఖ్యానిస్తున్నారు. దీంతో.. ఈ వ్యవహారం వెనుక చాలా అంశాలు ఉండొచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఒక ప్రముఖరాలికి సంబంధించిన భూమి కబ్జాకు గురి అవుతుందన్న ఆరోపణ స్థానికంగా సంచలనంగా మారింది.