Begin typing your search above and press return to search.

3 కోట్లంటూ హీరోయిన్ బ్లాక్ మెయిల్: మంత్రి

By:  Tupaki Desk   |   1 Jun 2021 8:00 AM IST
3 కోట్లంటూ హీరోయిన్ బ్లాక్ మెయిల్: మంత్రి
X
తమిళనాడులో మాజీ మంత్రిపై హీరోయిన్ చేసిన లైంగిక ఆరోపణలు సంచలనమైన సంగతి తెలిసిందే. మాజీ మంత్రి తనను పెళ్లి చేసుకుంటానని సహజీవనం చేసి కడుపు చేసి తీయించాడని నటి చాందిని ఇటీవల సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. తన భార్యకు విడాకులు ఇచ్చి తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని మాజీ మంత్రి మణికందన్ పై నటి ఆరోపించింది. సీక్రెట్ గా బెడ్ రూం, బాత్ రూమ్ వీడియోలు, ఫొటోలు తీసి ఇప్పుడు బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని సంచలన ఆరోపణలు చేసింది.

ఇక దీనిపై మాజీ మంత్రి మణికందన్ స్పందించాడు. నటి చాందిని వెనుక మనీ ల్యాండింగ్ ముఠా ఉందని.. కొన్ని రోజుల క్రితం 3 కోట్ల రూపాయలు ఇవ్వకుంటే మీమీద కేసులు పెడుతామని కొందరు బ్లాక్ మెయిల్ చేశారని.. డబ్బులు ఇవ్వలేదని ఇప్పుడు ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని మణికందన్ ఆరోపించారు. చాందిని వెనుక తన రాజకీయ ప్రత్యర్థులు ఉన్నారని.. తన రాజకీయ జీవితం అంతం చేయడానికి కుట్ర జరుగుతోందని చట్టపరంగా.. న్యాయస్థానంలో తాను చాందినిని ఎదుర్కొంటానని మాజీ మంత్రి మణికందన్ అంటున్నాడు.

అయితే తాజాగా ఈ కేసు మలుపు తిరిగింది. తనను మణికందన్ కు పరిచయం చేసిన వ్యక్తితోపాటు ఆయనకు సహకరించిన మరో వ్యక్తి మీద నటి చాందిని కేసులు పెట్టడం కలకలం రేపింది.నటి చాందిని పోలీసులను తికమక పట్టిస్తోందని సమాచారం. ఈ కేసులో మణికందన్ కు చాందిని పరిచయం చేసిన పరానీని పోలీసులు విచారణ చేసి అతన్ని సాక్షిగా చేర్చే అవకాశం ఉందని తెలిసింది.

ఇప్పటికే మాజీ మంత్రి మణికందన్ మీద ఆరు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు న్యాయ నిపుణులతో చర్చించి సరైన నిర్ణయం తీసుకోవాలని ఆచితూచి అడుగులు వేయాలని లేదంటే లేనిపోని సమస్యలు వస్తాయని ఆలోచిస్తున్నారని తెలిసింది.