Begin typing your search above and press return to search.

ఆ మాజీ మంత్రి వాడుకొని కడుపుచేసి వదిలేశాడు: హీరోయిన్

By:  Tupaki Desk   |   29 May 2021 3:51 AM GMT
ఆ మాజీ మంత్రి వాడుకొని కడుపుచేసి వదిలేశాడు: హీరోయిన్
X
సినీ ఇండస్ట్రీకి, రాజకీయాలకు చాలా దగ్గరి సంబంధాలుంటాయి. తారలే రాజకీయ నేతలుగా మారి రాజకీయాలను ఏలుతున్నారు. ఇప్పటికీ ఆ సంబంధాలు కొనసాగుతున్నాయి. తాజాగా ఓ రాజకీయ నేత, ఎమ్మెల్యే, మాజీ మంత్రి తనను ఐదేళ్లు సహజీవనంతో వాడుకొని గర్భవతిని చేసి మోసం చేశాడని సినీ నటి చాందిని పోలీసులకు ఫిర్యాదు చేసింది. దక్షిణాది సినిమా పరిశ్రమలో ఇదిప్పుడు సంచలనంగా మారింది.

తమిళ యువ హీరోయిన్ చాందిని ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలో పేరు సంపాదిస్తోంది. సినిమాలపై ఫోకస్ పెట్టిన ఈ యువ హీరోయిన్ కు రాజకీయ నాయకుడితో పరిచయం ఏర్పడింది. తమిళనాడులోని ఏఐడీఎంకే ఎమ్మెల్యే, మంత్రి మణికందన్ తో పరిచయం సహజీవనం వరకు వెళ్లింది. మంత్రి మణికందన్ తో సహజీవనం రంజుగా సాగింది. ఐదేళ్లపాటు వారిద్దరూ శృంగార జీవితాన్ని ఎంజాయ్ చేశారు. పెళ్లి వరకు రాగానే చాందినిని మంత్రి దూరంగా పెట్టడంతో వారి బంధం గొడవకు దారి తీసి బయటకు తెలిసింది.

మంత్రి మణికందన్ తనను మోసగించారంటూ హీరోయిన్ చాందిని ఆరోపించడం తమిళ సినీ, రాజకీయవర్గాల్లో సంచలనంగా మారింది. తనతో ఐదేళ్లు సహజీవనం చేసి నన్ను గర్భవతిని చేసి బలవంతంగా గర్భస్రావం చేయించాడని హీరోయిన్ చాందిని సంచలన ఆరోపణలు చేసింది. ప్రస్తుతం తన నోరు మూయించడానికి ప్రయత్నిస్తున్నారని.. గుండాలతో బెదిరిస్తున్నారని ఆమె ఆరోపించింది.

మణికందన్ తో సాన్నిహిత్యంగా ఉన్న ప్రైవేటు ఫొటోలను కూడా చాందిని లీక్ చేసింది. తనకు న్యాయం జరిగేంత వరకు మౌనంగా ఉండనని స్పష్టం చేసింది. తన ప్రాణాలకు ముప్పు ఉందని చాందిని ఫిర్యాదు చేసింది. ఆధారాలను పోలీసులకు సమర్పించింది.

మలేషియాలో జన్మించిన చాందిని సినిమాలపై మోజుతో చెన్నైలో అడుగుపెట్టింది. నాడోదిగల్ అనే సినిమాతో హీరోయిన్ గా పరిచయమైంది. ప్రస్తుతం పబ్జీ చిత్రంలో నటిస్తోంది.