Begin typing your search above and press return to search.
టీ కప్పు తుపానుగా దివ్యవాణి ఎపిసోడ్!
By: Tupaki Desk | 31 May 2022 1:09 PM GMTచిన్న అంశాలకు అవసరానికి మించి స్పందించి రచ్చ చేసుకోవటం.. ఆ తర్వాత వెనక్కి తగ్గటం రాజకీయాల్లో తరచూ చూస్తుంటాం. కానీ.. ఇలాంటివి రాజకీయ నేతల కెరీర్ ను దెబ్బ తీస్తాయన్న విషయాన్ని వారు మర్చిపోతుంటారు. తాజాగా టీడీపీ మహిళా నేత దివ్యవాణి ఎపిసోడ్ లో ఇలాంటిదే జరిగింది. మొత్తం వివాదాన్ని సింఫుల్ గా చెప్పాలంటే.. మహానాడులో ఆమెకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదు. దీంతో తీవ్ర ఆవేదనను.. ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన ఆమె ఒక యూట్యూబ్ చానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చారు.
ఈ సందర్భంగా ఆమె చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. మహానాడు సూపర్ సక్సెస్ అయ్యిందన్న సంతోషంతో ఉన్న టీడీపీకి దివ్యవాణి వ్యవహారం కంట్లో నలకలా మారింది. ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. 'మహానాడులో నాకు ఘోర అవమానం జరిగింది. కనీసం మాట్లాడే అవకాశం కూడా ఇవ్వలేదు. దివ్యవాణి మాటలు రాని అమ్మాయి కాదు. టీడీపీకి నేను నిస్వార్థంగా సేవ చేస్తున్నా గుర్తింపే లేదు. ఎన్టీఆర్ పెట్టిన పార్టీలో నాలాంటి కళాకారులకు స్థానం లేకపోవడం తీవ్ర ఆవేదనకు గురి చేస్తోంది. పార్టీలో ఎలాంటి గైడెన్స్ లేదు. ఇన్ని రోజులు నేను అధికారం లేని అధికార ప్రతినిధిగా టీడీపీలో ఉన్నాను' అంటూ మనసులోని ఆగ్రహాన్ని బడబడా చెప్పేశారు.
సొంత పార్టీ మీద తనకున్న ఆగ్రహాన్ని చెప్పటం వరకు బాగానే ఉందనుకున్నా.. అక్కడితో ఆగని ఆమె సీఎం జగన్ తో కానీ మాజీ మంత్రి కొడాలి నానితో తనకు ఎలాంటి వ్యక్తిగత విభేదాలు లేవని చెప్పటం టీడీపీలో కలకలం రేగింది. గతంలోనూ ఆర్కే రోజా విషయంలోనూ ఇలాంటి తప్పే చేసిన టీడీపీ.. నేటికి అందుకు మూల్యం చెల్లించుకుంటూనే ఉంది. ఇదిలా ఉంటే మంగళవారం (మే 31న) తాను టీడీపీకి రాజీనామా చేస్తున్నట్లు పేర్కొంటూ.. ఇంతకాలం తనను ఆదరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నట్లుగా సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు.
దీంతో ఒక్కసారిగా ఉలిక్కిపడిన టీడీపీ అధినాయకత్వం.. డ్యామేజ్ కంట్రోల్ కు తెర తీశారు. తెర వెనుక జరిగిన మంతనాలతో తెర ముందుకు వచ్చిన దివ్యవాణి.. తాను పోస్టు చేసిన రాజీనామా పోస్టును డిలీట్ చేశారు. తనను టీడీపీ క్రమశిక్షణ సంఘం అధ్యక్షుడు బచ్చుల అర్జునుడు పేరుతో సస్పెండ్ చేసినట్లుగా ఫేస్ బుక్ లో ఫేక్ పోస్టును వైరల్ చేశారని టీడీపీ చెబుతోంది. దివ్యవాణిని తాము సస్పెండ్ చేయలేదని పార్టీ స్పష్టం చేసింది.
దీంతో వెనక్కి తగ్గిన ఆమె.. తనకు ఎదురైన పరిస్థితుల్ని చంద్రబాబు.. లోకేశ్ దృష్టికి తీసుకెళతానని చెప్పటం చూస్తే.. ఆమె టీడీపీలోనే కొనసాగుతున్నట్లుగా అర్థమవుతుంది. ఇంత దానికి అంత హడావుడి చేయటం ఎందుకు దివ్యవాణి అంటున్నారు. కొన్ని సందర్భాల్లో ఎదురుదెబ్బలు.. అవమానాలు ఎదురైనా వాటిని పంటిబిగువును అదిమి పెట్టుకుంటే అందుకు తగ్గ ఫలితం దక్కుతుందన్న విషయాన్ని దివ్యవాణి గమనిస్తే.. ఇప్పుడు ఏర్పడిన రచ్చ రిపీట్ కాకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది.