Begin typing your search above and press return to search.
బూతు-బూటు కాలు..షార్ట్ ఫిల్మ్ నటి మాట!
By: Tupaki Desk | 27 Dec 2017 2:46 PM GMTపూర్తి నిడివి చిత్రాలు పోయి ఇప్పుడు షార్ట్ ఫిల్మ్‌ల గోల బాగానే ఎక్కువైందనే చెప్పాలి. బాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ - టాలీవుడ్ హిట్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ లాంటి వారు కూడా షార్ట్ పిల్మ్ ల బాట పడుతున్న నేపథ్యంలో ఇప్పుడంతా షార్ట్ ఫిల్మ్ ల చుట్టూతానే వ్యవహారం నడిచినా పెద్దగా ఆశ్చర్యపోవాల్సిన పని లేదనే చెప్పాలి. అయినా ఇప్పుడు షార్ట్ ఫిల్మ్ విషయంలో గోల ఎందుకు వినిపిస్తోందంటే... షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్ నంటూ ఎంట్రీ ఇచ్చిన యోగీ అనే దర్శకుడు... షార్ట్ ఫిల్మ్ యాక్టర్ గా ఇప్పుడు వెలుగులోకి వచ్చిన హారిక అనే నటి పరస్పరం పోట్లాడుకుంటున్నారు.
తనను అసభ్యకరంగా చిత్రీకరించడమే కాకుండా... తనను లొంగదీసుకోవాలని యోగీ యత్నిస్తున్నాడని హారిక పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఇప్పుడు ఇది రచ్చరచ్చగా మారిపోయింది. ఈ క్రమంలో పోలీస్ స్టేషన్ లో జరిగిన ఓ పంచాయతీ తరహా విచారణలో... యోగిని డీసీపీ స్థాయి పోలీసు అధికారి బూటు కాలితో తన్నారు. ఈ దృశ్యాలను వీడియో తీసిన కొందరు వ్యక్తులు దానిని సోషల్ మీడియాలో పెట్టేశారు. ఇప్పుడు అసలు కేసు పక్కనపడిపోగా... డీసీపీ బూటు కాలితో తన్నిన వ్యవహారమే హాట్ టాపిక్ గా మారిపోయింది. ఈ వ్యవహారంపై హారిక వివరణ ఇచ్చేందుకంటూ ఓ సెల్ఫీ వీడియోను విడుదల చేసింది.
సదరు సెల్ఫీ వీడియోలో గతంలో తాను చేసిన ఆరోపణలపై మరోమారు వినిపించిన హారిక... అసలు యోగిని డీసీపీ బూటు కాలితో తన్నడంలో ఎలాంటి తప్పు లేదని వాదించేసింది. అయినా మహిళను అని కూడా చూడకుండా... పోలీసుల ఎదుటే తనను యోగీ బూతులు తిట్టాడని - దీంతోనే డీసీపీ అతడిని బూటు కాలితో తన్నాడని ఆమె చెప్పింది. అయినా బూతులు మాట్లాడితే... బూటు కాలితో తన్నకుండా ఎత్తుకుని ముద్దెట్టుకుంటారా? అన్న కోణంలోనూ ఆమె డీసీపీని సమర్థించింది. ఇక్కడి పోలీస్ స్టేషన్ లో యోగీ బూతులు మాట్లాడినట్లుగానే దుబాయిలో జరిగి ఉంటే... కాలో - చెయ్యో తీసేస్తారని కూడా కాస్తంత ఘాటుగానే రిప్లై ఇచ్చింది. మరి ఈ కామెంట్లపై అటు వైపున ఉన్న డైరెక్టర్ యోగీ గానీ,. పోలీసులు గానీ ఏమంటారో చూడాలి.