Begin typing your search above and press return to search.
ఆ సినీనటి బాబుపై మండిపడి చాన్స్ కోరింది
By: Tupaki Desk | 26 Feb 2017 10:42 AM GMTతెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తనను పట్టించుకోకపోవడాన్ని జీర్ణించులేకపోతున్నట్లు సినీనటీ, టీడీపీనాయకురాలు కవిత ఆవేదన వ్యక్తం చేశారు. అయినా తాను తెలుగుదేశం పార్టీలో కొనసాగుతానని ఆమె అన్నారు.కొన్ని పార్టీలు తమ కండువా కప్పుకోవాలని కోరుతున్నప్పటికీ అన్నగారి మీద అభిమానం, చంద్రబాబు మీద నమ్మకంతోనే ఇంకా పాజిటివ్‌గా ఉన్నానని, టీడీపీని వీడే ప్రసక్తి లేదని సినీ నటి కవిత చెప్పారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు తన కుటుంబాన్ని, సంపాదనను వదిలి పార్టీ కోసం శాయశక్తులా కృషి చేశానని, అధికారంలోకి రాగానే తనను పక్కన పెట్టడాన్ని జీర్ణించుకోలేకపోతున్నానని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఎప్పటికైనా చంద్రబాబు వాస్తవాలను గ్రహించి నిజమైన కార్యకర్తలకు న్యాయం చేస్తారనే నమ్మకం ఉందని కవిత అన్నారు. ఎమ్మెల్సీ బరిలో తానూ ఉన్నానని స్పష్టం చేశారు.
ఏపీ సీఎం చంద్రబాబు అవిరళంగా రాష్ట్ర అభివృద్ధికి కృషిచేస్తున్నారని, ఆయన వినూత్న కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో తీసుకువెళ్లేందుకు పార్టీ అభిమానిగా తానెప్పుడూ సిద్ధంగానే ఉంటానని కవిత చెప్పారు. తనకు నటనా జీవితం సంతృప్తికరంగా సాగినా రాజకీయరంగంలో ఒడుదుడుకులు ఎదుర్కొన్నానని ఆవేదన వ్యక్తం చేశారు. సినిమా పరిశ్రమలో ఎక్కువగా అభిమానించే వ్యక్తి ఎన్టీఆర్ అని, 1982లోనే పార్టీ సభ్యత్వం తీసుకుని చైతన్య రథం వెంట ప్రచారాలు నిర్వహించానని చెప్పారు.