Begin typing your search above and press return to search.

టీకా పేరు చెప్పి నటి, లేడీ ఎంపీకే షాకిచ్చారు

By:  Tupaki Desk   |   24 Jun 2021 4:30 PM GMT
టీకా పేరు చెప్పి నటి, లేడీ ఎంపీకే షాకిచ్చారు
X
ఇప్పుడు దేశంలో అత్యంత అవసరం ఉన్నది ఏందయ్యా అంటే అది కేవలం 'వ్యాక్సిన్' మాత్రమే. కానీ 135 కోట్ల భారతానికి సరిపడా వ్యాక్సిన్లు లేవు. కొరతతో ఇప్పుడు వ్యాక్సిన్ల కోసం జనం వెంపర్లాడుతున్న పరిస్థితి నెలకొంది. దాన్ని కొందరు కేటుగాళ్లు క్యాష్ చేసుకుంటున్నారు.

ప్రస్తుతం కరోనా విపత్తులో ప్రజాప్రతినిధులు సైతం కరోనా టీకాల కోసం అగచాట్లు పడుతున్న పరిస్థితులున్నాయి. టాలీవుడ్ లో నిర్మాత సురేష్ బాబును సైతం ఓ కేటుగాడు వ్యాక్సిన్ల పేరిట మోసం చేసిన సంగతి తెలిసిందే. రూ. లక్ష రూపాయలు ట్రాన్స్ ఫర్ చేసుకొని మోసం చేశాడు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశఆడు.

తాజాగా తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ, ప్రముఖ నటి మిమి చక్రవర్తికి సైతం ఓ వ్యక్తి బురిడీ కొట్టించాడు.తాను ఒక ఐఏఎస్ అధికారినంటూ నమ్మించాడు. తనను తాను పరిచయం చేసుకొని వ్యాక్సిన్ డ్రైవ్ ను ప్రారంభించాలని కోరాడు. దీంతో ఎంపీ మిమి చక్రవర్తి సైతం ఈ సామాజిక కార్యక్రమానికి హాజరయ్యారు. వారు ఇచ్చిన నకిలీ టీకాను వేసుకొని అందరూ వేసుకోవాలని పిలుపునిచ్చారు.

కానీ ఇక్కడే ట్విస్ట్ ఉంది. టీకా తీసుకున్నట్టు ప్రభుత్వం నుంచి వచ్చే మెసేజ్ ఆమెకు రాలేదు. ఆన్ లైన్ చేసినా రాకపోవడంతో ఆమెకు డౌట్ వచ్చి ఆరాతీయగా.. సదురు వ్యక్తి పొంతనలేని సమాధానాలుచెప్పాడు. దీంతో పోలీసులకు ఎంపీ మిమి ఆశ్రయించింది. రంగంలోకి దిగిన పోలీసులు మిమి చక్రవర్తిని మోసం చేసిన వ్యక్తిని దేవాంజన్ దేవ్ గా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. ఐఏఎస్ నంటూ మోసం చేసిన ఆ వ్యక్తి ఆటకట్టైంది.