Begin typing your search above and press return to search.
పాక్ పీఎం పదవిపై దావూద్ గర్ల్ ఫ్రెండ్ కన్ను?
By: Tupaki Desk | 28 July 2021 2:30 AM GMTముంబై బాంబ్ పేలుళ్ల సూత్రధారి దావూద్ ఇబ్రహీం పాకిస్తాన్ పారిపోయి కొన్నేళ్లుగా అక్కడే నివాసం ఉంటున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే అవే కుట్రలు, కుతంత్రాలు చేస్తున్నాడు. అయితే దావూద్ గర్ల్ ఫ్రెండ్ అంటూ పాకిస్తాన్ నటి మోహ్విష్ హయత్ షాకింగ్ కామెంట్స్ చేసింది. ఆమె కన్ను ప్రస్తుతం పాకిస్తాన్ సీఎం పదవిపై పడింది.
తాజాగా నటి మోహ్మిష్ సంచలన కామెంట్స్ చేసింది. ఓ చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మోహ్విష్ ఈ వ్యాఖ్యలు చేసింది. తనకు ప్రస్తుత ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఇన్ స్పిరేషన్ అని పేర్కొంది. రాజకీయాల్లోకి రాకుముందు ఇమ్రాన్ ఒక క్రికెటర్ అని.. క్రికెటర్ ప్రధాని అయినప్పుడు సినీ నటులు ఎందుకు కాకూడదని నటి ప్రశ్నించింది.
ఖచ్చితంగా ప్రధాని పదవికి తాను పోటీ చేస్తానని మెహ్విష్ హయత్ పేర్కొంది. అయితే తాను ఇమ్రాన్ ఖాన్ ను చాలెంజ్ చేయాలనుకోవడం లేదని.. ఇంకెవరైనా ఆస్థానానికి పోటీ చేయాలనుకుంటే తాను కూడా బరిలో ఉంటానని చెప్పుకొచ్చింది.
ముంబై మాఫియా అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం ప్రేయసిగా పాకిస్తాన్ లో వెలుగులోకి వచ్చిన మెహ్వీష్ హయత్ నోటిదురుసు.. వ్యక్తిగత జీవితంపై ఇప్పుడు మీడియాలో కథలు కథలుగా వార్తలు బయటకు వస్తున్నాయి. పాకిస్తాన్ నటి మెహ్వీష్ హయత్ కు సినీ కుటుంబ నేపథ్యం ఉంది. ఆమె తల్లి టెలివిజన్ నటి కాగా.. సోదరుడు మ్యూజిక్ డైరెక్టర్. సోదరి గాయకురాలే..అన్నయ్య నటుడు. ఇలా పాక్ సినీ పరిశ్రమలో మెహ్వీష్ బలమైన నేపథ్యం ఉంది. అయితే సక్సెస్ కాలేకపోయింది.
అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంతో ఎఫైర్ కారణంగానే పాక్ సినీ ఇండస్ట్రీలో భారీ ఆఫర్లను మెహ్వీష్ దక్కించుకుందనే ప్రచారం ఉంది. అందుకే ఐటం గర్ల్ గా తన సినీ కెరీర్ ఆరంభించిన మోహ్విష్ హయత్ కు పాకిస్తాన్ పౌరపురస్కారమైన ‘తమ్గా ఇంతియాస్’ 2019లో లభించిందని ఆరోపించాయి. ఎందుకంటే అంతగా పాకిస్తాన్ సినీ పరిశ్రమకు తెలియని ఆమెకు ఆ అవార్డు దక్కడం వెనుక దావూద్ ఇబ్రహీం లాబీయింగ్ ఉందని సినీ పరిశ్రమ ఆరోపణ..
పాకిస్తాన్ లోని బాలాకోట్ దాడులను సమర్థించిన ప్రియాంక చోప్రాపై మెహ్వీష్ గతంలో నోరుపారేసుకుంది. యుద్ధాన్ని ప్రోత్సహిస్తున్నదంటూ కామెంట్ చేసింది.ఇక పాకిస్తాన్ కు వ్యతిరేకంగా రూపొందిన వెబ్ సిరీస్ ను ప్రమోట్ చేసిన షారుఖ్ ఖాన్ పై కూడా ఆడిపోసుకుంది. ఇస్లాం మతానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నావ్ అంటూ షారుఖ్ పై మండిపడింది.
ప్రస్తుతం దావూద్ తన కంటే 27 ఏళ్లు చిన్న అయిన మెహ్వీష్ తో ఎఫైర్ పెట్టుకోవడం విశేషం. ఈమెను ఏకంగా ప్రధాని పదవిపై కన్నేయడం ఆసక్తి రేపుతోంది.