Begin typing your search above and press return to search.
ట్వీట్ జారిన నేహాకు బాగానే తెలిసొచ్చింది
By: Tupaki Desk | 27 July 2015 12:33 PM GMTకాలు జారినా ఫర్లేదు.. నోరు జారితే ఇబ్బందేనన్నది పాత సామెత అయ్యింది. ఇప్పుడు కాలు.. నోరు జారినా ఫర్లేదు.. ట్వీట్ జారితేనే అసలు ఇబ్బంది. నోరు జారితే నలుగురికి తెలిస్తే.. ట్వీట్ జారితే ప్రపంచం మొత్తానికి తెలిసిపోయే పరిస్థితి.
నిన్నటికి నిన్న ముంబయి పేలుళ్ల విషయంలో ఉరిశిక్ష కు సిద్ధం అవుతున్న యాకూబ్ మెమన్ విషయంలో కనికరం చూపించాలని.. యాకూబ్‌ను ఉరి తీయటం అంటే మానవత్వాన్ని ఉరి తీసినట్లేనంటూ ట్వీట్స్ చేసి అడ్డంగా బుక్ అయిన సల్మాన్ కు కొద్ది రోజులు ముందు బాలీవుడ్ ముద్దుగుమ్మ నేహాధూపియా రెచ్చిపోవటం తెలిసిందే.
మంచి పాలన అంటే.. సెల్ఫీలు.. యోగా దినోత్సవాలు నిర్వహించటం కాదంటూ వ్యాఖ్యానించి.. పలువురు ఆగ్రహానికి గురైన ఆమె.. అప్పట్లోనే తన ట్వీట్ విషయంలో వివరణ ఇచ్చింది. అయినప్పటికి ఆమెపై నిరసనలు తగ్గకపోవటంతో తాజాగా మరోసారి వివరణ ఇచ్చింది. అయితే.. గతంతో పోలిస్తే ఈ వివరణ సంజాయిషీ మాదిరి.. చెంపలేసుకున్న చందంగా ఉండటం గమనార్హం.
ముంబయి ప్రజలకు సాయం చేయలేకపోతున్నాననే చిరాకుతో తాను ఆ విధంగా ట్వీట్ చేశానని.. ఎవరినీ ఉద్దేశించి కాదని చెప్పుకున్న ఆమె మాటల్నే తీసుకుంటే.. సాయం చేయకపోతే.. ప్రభుత్వంపై విరుచుకుపడతారా? అన్న ప్రశ్న ఉదయించటం ఖాయం. తాను ఎవరి సెంటిమెంట్లు కించపర్చటానికి ట్వీట్స్ చేయలేదని చెప్పిన ఆమె మాటల తీరు చూస్తుంటే.. ఏ స్థాయిలో ఆమె నిరసన ఎదుర్కొంటున్నారో ఇట్టే అర్థం అవుతుంది. తొందరపడి ట్వీట్ జారితే ఎంత కష్టమన్న విషయం నేహా ధూపియాకు ఇప్పుడు బాగానే అర్థమై ఉంటుంది.