Begin typing your search above and press return to search.
అదేంది రమ్య.. అంత పని చేశావ్!
By: Tupaki Desk | 14 May 2018 6:59 AM GMTకర్ణాటక రాజకీయాల్లో తరచూ వినిపించే పేరు రమ్య. సినీ నటిగా సుపరిచితురాలైన రమ్య.. ఊహించని రీతిలో రాజకీయాల్లోకి రావటం.. కాంగ్రెస్ లాంటి పార్టీలో చాలా స్వల్ప వ్యవధిలోనే గుర్తింపు పొందటం తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ టీంలో కీలక మెంబర్ గా ఆమె ఎదిగారు.
ఉప ఎన్నికల్లో పోటీ ద్వారా రాజకీయ తెర మీదకు వచ్చిన రమ్య.. 2014 సార్వత్రిక ఎన్నికల్లో ఓడిపోయారు. అయినప్పటికీ ఆమె సామర్థ్యం మీద నమ్మకం ఉంచిన రాహుల్.. పార్టీ డిజిటల్ విభాగాన్ని ఆమెకు అప్పగించారు. అధినేత నమ్మకాన్ని వమ్ము చేయిన రమ్య.. తన పని తీరును ప్రశంసలు పొందుతోంది. ఇటీవల కాలంలో ప్రధాని మోడీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడిన రమ్య ఇప్పుడు టార్గెట్ గా మారారు.
రెండు రోజుల క్రితం జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో రమ్య ఓటు వేయకపోవటంపై సోషల్ మీడియాలో పలువురు మండిపడుతున్నారు. మండ్యలోని కేఆర్ రోడ్డులోని పీఎల్ డీ బ్యాంక్ పోలింగ్ కేంద్రంలో రమ్యకు ఓటుహక్కుఉంది. అయితే.. ఆమె ఓటు వేయలేదు. దీనిపై సోషల్ మీడియాలో మండిపాటు వ్యక్తమవుతోంది.
ఓటు వేయాల్సిన రమ్య పోలింగ్ రోజున తన ఓటుహక్కును వినియోగించకపోవటం అంటేనే.. రాజకీయాల గురించి మాట్లాడే నైతిక హక్కు కోల్పోయారని పంచ్ లు వేస్తున్నారు. ఓటు వేయని రమ్య నెంబర్ వన్ సిటిజన్ అంటూ వ్యంగ్య వ్యాఖ్యలు చేస్తున్న వారు లేకపోలేదు. అయినా.. పార్టీ అధ్యక్షుడి సన్నిహిత టీంలో సభ్యుడిగా ఉంటూ.. కీలక ఎన్నికల్లో ఓటు వేయకపోవటం ఏమిటన్నది ప్రశ్నగా మారింది. ఇలాంటి తప్పులు చేసే డ్యామేజ్ చాలా ఎక్కువన్న విషయాన్ని రమ్య ఎందుకు మిస్ అవుతున్నారు? మరి.. ఈ విషయం మీద రమ్య రియాక్షన్ ఏమిటో చూడాలి.