Begin typing your search above and press return to search.

సీఎంనే నిలదీసిన నటి... లాజిక్ క్వశ్చనే

By:  Tupaki Desk   |   7 Sep 2019 6:09 AM GMT
సీఎంనే నిలదీసిన నటి... లాజిక్ క్వశ్చనే
X
ఇప్పుడంతా రోడ్ సేఫ్టీ పేరిట కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త జరిమానాలపైనే చర్చ జరుగుతోంది. మొన్న ఒకటో తారీఖు నుంచి అమల్లోకి వచ్చిన కొత్త వాహన జరిమానాలు... దేశవ్యాప్తంగా పెద్ద చర్చనే రేపాయి. ఈ చర్చకు తగ్గట్లే ట్రాఫిక్ పోలీసులు ఎక్కడికక్కడ నిబంధనలు అతిక్రమించారంటూ వాహనదారులకు వేలకు వేలు ఫైన్ లు వేస్తున్నారు. ఈ తరహా జరిమానాలపై కన్నడ చిత్రసీమకు చెందిన ఓ నటి... నేరుగా కర్ణాటక సీఎం బీఎస్ యడియూరప్పకే ఓ సంచలన ప్రశ్న సంధించారు. లాజికల్ గానే ఉన్న ఈ ప్రశ్న ఇప్పుడు నిజంగానే వైరల్ గా మారిపోయింది.

రోడ్ సేఫ్టీ పేరిట వాహనదారులకు వేలకు వేలు ఫైన్ వేస్తున్న ప్రభుత్వాలు... మరి సరైన రోడ్లను ఏర్పాటు చేయని ప్రభుత్వాలపై ఎలాంటి చర్యలు తీసుకోవాలో చెప్పండంటూ కన్నడ నటి సోను గౌడ... సీఎం యడియూరప్పను ప్రశ్నించేశారు. ట్విట్టర్ వేదికగానే సోను సంధించిన ఈ ప్రశ్న... చాలా లాజికల్ గానే ఉందన్న వాదన వినిపిస్తోంది. బెంగళూరు వాహనాలకు జరిమానాలు విధించే ముందు సరైన రోడ్లను తయారు చేయాలని ఆమె సూచించారు. ఈ మేరకు శుక్రవారం ఆమె సంచలన ట్వీట్‌ చేశారు.

‘నిబంధనలు అతిక్రమించారన్న కారణంగా వాహనదారులకు జరిమానాలను విధించటం కాదు. ప్రజలు కష్టపడి సంపాదించిన డబ్బులను జరిమానాల రూపంలో వసూలు చేయటం కాదు. మొదట ప్రజలు జీవించటానికి సరైన రోడ్లను అందించండి’ అంటూ ఆమె తన ట్వీట్ లో కోరారు. తన ట్వీటర్‌ ఖాతాలో ఓ వాహనదారుడు... ఒకరు రోడ్డుపై పడుతున్న ఫొటోను పోస్ట్‌ చేశారు. అందులో తాగినందుకు రూ.10 వేలు, సెల్‌ ఫోన్‌ వాడితే రూ. 5 వేలు జరిమానా అంటూ రాశారు. అయితే బైకుదారుడు రోడ్డుపై పడితే ప్రభుత్వానికి ఎంత జరిమానా అంటూ సోను ప్రశ్నించారు. ఈ ట్వీట్ ఇప్పుడు పెరిగిన ఫైన్లపై చర్చను మరింత విస్తృతం చేసిందన్న వాదన వినిపిస్తోంది.