Begin typing your search above and press return to search.
చినబాబుకు గట్టి సపోర్ట్ దొరికిందబ్బా!
By: Tupaki Desk | 5 Jun 2018 7:49 AM GMTటీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి - ఏపీ కేబినెట్ లో కీలక శాఖల మంత్రిగా ఉన్న నారా లోకేశ్ ఎప్పటికప్పుడు ఏదో ఒక విమర్శ ఎదుర్కొంటూనే ఉన్నారు. పార్టీ అధినేతగానే కాకుండా ఏపీ సీఎంగా ఉన్న నారా చంద్రబాబునాయుడి కుమారుడై ఉండి దొడ్డిదారిన చట్టసభలోకి ప్రవేశించి - ఆ వెంటనే కేబినెట్ లోకి కూడా ఎంట్రీ ఇచ్చిన లోకేశ్ పై ఇప్పటికీ పెద్ద ఎత్తున విమర్శలు రేగుతూనే ఉన్నాయి. రాష్ట్ర రాజకీయాలతో పాటు జాతీయ రాజకీయాల్లోనూ తానంత సీనియర్ ఎవరూ లేరని - 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు... తన కుమారుడిని ఇలా దొడ్డిదారిన చట్టసభకు ఎందుకు పంపారబ్బా అంటూ గుసగుసలూ వినిపించిన విషయం తెలిసిందే కదా. అయినా ఈ విమర్శలను ఏమాత్రం లెక్కచేయని బాబు - చినబాబులు తాము అనుకున్నది చేసుకుంటూ పోతున్నారు. ఈ క్రమంలోనూ లోకేశ్ పలు వివాదాల్లో చిక్కుకుంటున్న వైనం నిజంగానే ఆశ్చర్యం కలిగించక మానదు. అయినా ఏమాత్రం అనుభవం లేకుండానే మంత్రిగా పదవీ బాధ్యతలు తీసుకుంటే పరిస్థితి ఇలాగే ఉంటుందంటూ గిట్టని వారితో పాటుగా సొంత పార్టీలోని వారు కూడా చెవులు కొరుక్కుంటున్నారట.
ఇదంతా బాగానే ఉన్నా... తనపై దూసుకువస్తున్న విమర్శలను కూడా తిప్పికొట్టగలిగే స్తోమత లోకేశ్ కు దాదాపుగా లేదన్న కోణంలో పెద్ద ఎత్తున విశ్లేషణలు వినిపిస్తున్నాయి. మరి ఈ విషయం నిజమేనన్నట్లుగా... టీడీపీ నేతలు మాత్రం లోకేశ్ ను ఎవరైనా - ఏమైనా అన్నంతనే రంగంలోకి దిగిపోతున్నారు. మొన్నామధ్య లోకేశ్ పై జనసేన అధినేత పవన్ కల్యాణ్ నేరుగా అవినీతి ఆరోపణలు చేసిన సందర్భంగానూ లోకేశ్ కంటే ముందుగా టీడీపీ నేతలే రంగంలోకి దిగిపోయారు. ఆ తర్వాత రెండు మూడు రోజులకు గానీ లోకేశ్ తేరుకోలేకపోయిన వైనంపై సోషల్ మీడియా తనదైన శైలి కథనాలు రాసేసింది. అయినా ఇప్పుడు ఆ కథ అంతా ఇప్పుడు ఎందుకంటే... టీడీపీ నేతల కంటే కూడా లోకేశ్ కు ఇప్పుడు మంచి సపోర్ట్ లభించేసింది. నోటికి అదుపు లేకుండా... ఎంత మాట వస్తే అంత మాట అనేసే లక్షణమున్న టీడీపీ నేతల కంటే కూడా పెద్ద సపోర్ట్ లభించిందంటే... అది ఎవరిదై ఉంటుందంటారా? ఇంకెవరండీ బాబూ... క్యాస్టింగ్ కౌచ్ పై తనదైన శైలి పోరాటం చేసి దేశవ్యాప్త గుర్తింపు సంపాదించిన టాలీవుడ్ నటి శ్రీరెడ్డే.
శ్రీరెడ్డి... లోకేశ్ కు సపోర్ట్‌గా నిలిచారా? అంటే... నిజమేనని చెప్పక తప్పదు. ఎందుకంటే లోకేశ్ కు సపోర్ట్ గా నిలబడుతూ శ్రీరెడ్డి స్వయంగా తన ఫేస్ బుక్ ఖాతాలో ఓ ఆసక్తికర వ్యాఖ్య చేశారు. అయినా సదరు కామెంట్ లో శ్రీరెడ్డి ఏమన్నారన్న విషయానికి వస్తే... *నారా లోకేశ్ గారిని ఎవరైనా ఏమైనా అంటే ఊరుకునేవాళ్లు ఎవరూ లేరు. కొత్త పార్టీ ఏం చేస్తుందో అది చెప్పుకోండి. అంతేగానీ లోకేశ్ ను విమర్శిస్తే ఒప్పుకునేది లేదు. నా నోటికి పని చెప్పొద్దు* అని లోకేశ్ కు శ్రీరెడ్డి బహాటంగానే కాకుండా గట్టి సపోర్ట్ గా నిలబడ్డారు. ఏ ఒక్కరూ ఊహించని విధంగా లోకేశ్ కు సపోర్ట్‌గా నిలబడ్డ శ్రీరెడ్డి... పవన్ కల్యాణ్‌ను ఉద్దేశించి కాస్తంత ఘాటు వ్యాఖ్యలు కూడా చేశారు. పవన్ పేరు ఎత్తకుండానే శ్రీరెడ్డి చేసిన ఆ కామెంట్ ఎలా సాగిందంటే... *మీ అన్న తిరుపతి నుంచి ఎన్నికై, అక్కడ పైసా అభివృద్ధి చేయలేదని ప్రజలందరికీ తెలుసు. ఓర్పుగా ఉండటం సినిమా డైలాగ్స్ కొట్టి నీళ్లు తాగినంత సులువు కాదు. మీ అన్న రాజకీయాలు, సినిమాల్లో ఎంతమందిని తొక్కాడో ఎవరికి తెలియదు?* అని పరోక్షంగానే అయినా పవన్‌ను సూటిగానే టార్గెట్ చేశారని చెప్పక తప్పదు.