Begin typing your search above and press return to search.
జగన్ అన్నకు ఉన్న ఓపిక నీకు లేదు:శ్రీరెడ్డి
By: Tupaki Desk | 20 April 2018 4:45 PM GMTపవన్ ను శ్రీరెడ్డి టార్గెట్ చేయడం వెనుక వర్మతో పాటు కొందరు వైసీపీనేతలు కూడా ఉన్నారని,రాజకీయంగా పవన్ ను దెబ్బకొట్టేందుకే ఈ రకమైన పనులకు పాల్పడుతున్నారని సోషల్ మీడియాలో పోస్టులు వస్తున్న సంగతి తెలిసిందే. శ్రీరెడ్డికి సన్నిహితురాలైన నటి తమన్నా సింహాద్రికి వైసీపీ నేతలతో పరిచయాలున్నాయని, ఆమె ద్వారానే పవన్ ను శ్రీరెడ్డి టార్గెట్ చేసిందని పుకార్లు హల్ చల్ చేస్తున్నాయి. అయితే, ఆవ్యాఖ్యలను తమన్నా సింహాద్రి ఖండించింది. పవన్ ను శ్రీరెడ్డి టార్గెట్ చేయడానికి వర్మ కారణమని, వైసీపీకి ఎటువంటి సంబంధం లేదని క్లారిటీ ఇచ్చింది. ఇదే విషయంపై తాజాగా శ్రీరెడ్డి కూడా క్లారిటీ ఇచ్చింది. తమ ఉద్యమానికి, ఏ పొలిటికల్ పార్టీకి ఎటువంటి సంబంధం లేదని చెప్పింది. కొందరు చెప్పిన మాటలను విని వైఎస్ ఆర్ సీపీని అనుమానించినందుకు చాలా బాధపడుతున్నానని చెప్పింది. అంతేకాకుండా, వైసీపీ అధినేత జగన్ కు బహిరంగ క్షమాపణలు చెప్పింది. కొందరు చెప్పిన మాటలు విని తాను వైసీపీని అనుమానించానని, కానీ ఇపుడు ఆ సందేహాలు తీరిపోయాయని శ్రీరెడ్డి తెలిపింది. ``జగన్ గారూ మై సిన్సియర్ అపాలజీస్. ఎవరో ఏదో డౌట్ సృష్టించారు. కొంచెం అనుమానం పడ్డ మాట వాస్తవమే గానీ...మీరంటే నాకెప్పుడూ గౌరవం అండి. క్షమించండి సర్. ఉద్యమాన్ని తొక్కాలన్న థాట్ ఇండస్ట్రీలో కొంతమంది పెద్దోళ్ల ఆలోచనలు....పొలిటికల్ పార్టీస్ కి పోరాటానికి సంబంధం లేదు`` అని శ్రీరెడ్డి పోస్ట్ చేసింది.
పవన్ ను ఉద్దేశించి పరోక్షంగా శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసింది. ``టీవీ చానెళ్లపై లీగల్ ఫైట్ చేయడం ఆపడం మంచిదని నా సలహా. అలా చేస్తే నీ రాజకీయ జీవితం నాశనం అవుతుంది. చెల్లి అన్నారు కాబట్టి నా సలహా`` అంటూ పోస్ట్ చేసింది. ``నువ్వు ప్రజానాయకుడి అయితే రాష్ట్రాన్ని అల్లర్లతో రణరంగం చేస్తావా? అభిమానులను మేనేజ్ చేసుకోలేని నువ్వు... రాష్ట్రాన్ని ఎలా మేనేజ్ చేస్తావు? జగన్ అన్నకు ఉన్న ఓపిక.. సహనం ముందు నువ్వు నథింగ్`` అంటూ శ్రీరెడ్డి పోస్ట్ చేసింది. మా బాలయ్య ఈ రోజు సభలో మఖ్ఖీ ...అన్నారని ...ఎవరేం చేస్తారని....తాను టీడీపీకి సపోర్ట్ చేస్తానని చెప్పింది. మరోవైపు....కేసీఆర్ తన గురువని....అందరినీ కలుపుకొని పోతా నని పోస్ట్ చేసింది. కన్ఫూజ్ కావద్దని...తాను ఏపార్టీకి సంబంధించిన దానిని కాదని, ....తన ఉద్యమానికి అందరి మద్దతు కావాలని కోరింది. పొలిటికల్ ఎజెండాతో తన వెనక ఉండి వెన్నుపోటు పొడిచిన తమన్నాపై శ్రీరెడ్డి మండిపడింది. ట్రాన్స్ జెండర్లకే తమన్నా ఒక మచ్చలాంటి వ్యక్తి అని, తమ ఉద్యమానికి వెన్నుపోటు పొడిచిందని ఆగ్రహం వ్యక్తం చేసింది. చంద్రముఖి - రచన - సోనా రాథోడ్ లాంటి వారిని చూసి తమన్నా నేర్చుకోవాలని సూచించింది.