Begin typing your search above and press return to search.

ఆదాల రూటే సపరేటబ్బా!

By:  Tupaki Desk   |   16 March 2019 2:00 PM IST
ఆదాల రూటే సపరేటబ్బా!
X
మీరు చిన్నప్పుడు సుమతి - మందమతి - కాలమతి అనే కథ చదివే ఉంటారు. సందర్భానికి తగ్గట్లుగా పరిస్థితి అర్థం చేసుకుని నిర్ణయాలు తీసుకోవడమే జీవితం. అందుకే ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న నాయకులంతా టీడీపీని వదిలి వైసీపీలోకి వచ్చేస్తున్నారు. కారణం ఒక్కటే.. రాబోయేది వైసీపీ ప్రభుత్వమే అనేది వారందరికి అర్థమైంది. అందుకే టీడీపీలో గెలిచి ప్రతిపక్షంలో ఉండడం కంటే.. వైసీపీలో గెలిచి అధికారపక్షంలో ఉండాలనుకుంటున్నారు. టీడీపీలో టిక్కెట్‌ రానివాళ్లే కాదు.. వచ్చిన వాళ్లు కూడా ఆ పార్టీని వదిలి ఛలో లోటస్‌ పాండ్‌ అంటున్నారు.

నెల్లూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రి ఆదాల ప్రభాకరరెడ్డి గత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. ఆయనకు మళ్లీ సీటు ఇచ్చింది టీడీపీ. కానీ ఆయనకు టీడీపీ నుంచి పోటీ చేయండ ఇష్టం లేదు. ఎందుకంటే పోయినసారే గెలవనప్పుడు ఇప్పుడు ఎలా గెలుస్తాం అనేది ఆయన పాయింట్‌. అయినా కూడా అయిష్టంగానే ప్రచారం చేసుకుంటూ వస్తున్నారు. ఈ లోగా సడన్‌ గా ఆయన ఫోన్‌ కి ఒక మేసేజ్‌ వచ్చింది. ప్రభుత్వం నుంచి రావాల్సిన కాంట్రాక్టు పనుల తాలూకు డబ్బులు రూ.43 కోట్లు ఆయన ఎక్కౌంట్‌ లో పడ్డాయి . అంతే ఆయన ఎన్నికల ప్రచారం నుంచి సడన్‌ గా మాయమైపోయారు. ఫోన్‌ కూడ స్విచ్చాఫ్‌ చేసుకున్నారు. ఎంక్వైరీ చేస్తే.. డైరెక్ట్‌ గా వచ్చి లోటస్‌ పాండ్‌ లో తేలారు. జగన్‌ నుంచి స్పష్టమైన హామీ లభించడంతో.. టీడీపీ టిక్కెట్‌ ని కూడా కాదనుకుని వైసీపీలో చేరిపోయారు ఆయన. ఎప్పుడొచ్చామన్నది కాదన్నయ్యా… వైసీపీ నుంచి టిక్కెట్‌ దొరికిందా లేదా అనేదే పాయింట్‌ అంటున్నారు ఆదాల ప్రభాకరరెడ్డి. ఇంకా చెప్పాలంటే జంపింగ్‌ జపాంగ్‌ లో కొత్త ఒరవడి సృష్టించారు ఆయన.