Begin typing your search above and press return to search.

కూచిభొట్ల హంతకుడికి యావజ్జీవమా...?

By:  Tupaki Desk   |   28 Feb 2017 11:49 AM GMT
కూచిభొట్ల హంతకుడికి యావజ్జీవమా...?
X
అమెరికాలో జాత్యాహంకార దాడికి పాల్పడి తెలుగు ఇంజినీర్ కూచిభోట్ల శ్రీనివాస్ ను హత్య చేసి మరో ఇద్దరిని గాయపరిచిన నిందితుడిని కోర్టులో హాజరు పరిచారు. అమెరికా నేవీలో అధికారిగా పని చేసిన ఆడమ్ ప్యూరింటన్ జాత్యాహంకార నేరానికి పాల్పడినట్లు కోర్టులో రుజువైతే అతడికి 50 ఏళ్ల జైలు శిక్షపడే అవకాశం ఉంది. ఆయనకు మరణశిక్ష పడినా పడొచ్చని నిపుణులు చెబుతున్నారు.

అమెరికా నావికాదళ మాజీ అధికారి అయిన ప్యూరింటన్‌‌ను తొలిసారిగా పోలీసులు సోమవారంనాడు కోర్టు ముందు హాజరుపరిచారు. విచారణలో భాగంగా అడిగిన ప్రశ్నలన్నింటికీ ఆయన ఏమాత్రం భయపడకుండా, పశ్చాత్తాపం లేకుండా నిర్లష్యంగా సమాధానాలిచ్చాడు. ప్యూరింటన్ జాత్యహంకార నేరానికి పాల్పడినట్టు డిస్ట్రిక్ట్ కోర్టులో రుజువైతే ఆయనకు 50 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంది.

గత బుధవారం కూచిభొట్ల శ్రీనివాస్ ను హత్య చేసిన ప్యూరింటన్ అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు. అయితే.. వెస్ట్ సెంట్రల్ మిస్సౌరీలోని హెన్రీ కౌంటీలో పోలీసులు అతణ్ని అరెస్టు చేశారు. ఫస్ట్ డిగ్రీ మర్డర్‌, ఫస్ట్ డిగ్రీ హత్యాయత్నం కింద ఆయనపై అభియోగాలు నమోదు చేశారు. జాన్సన్ కౌంటీ జైలులో ప్రస్తుతం ఆయనను ఉంచారు. కాగా, ఈ కేసులో సాక్ష్యాధారాలను సేకరణకు ఎఫ్‌బీఐ సహకరిస్తోంది. పోలీసులు అతనిపై ఇప్పటికే వీడియో ఫుటేజ్ సహా, పక్కా సాక్ష్యాలు సేకరించారు. అతనే స్వయంగా కాల్పులకు పాల్పడినట్టు ప్రత్యక్ష సాక్షులు కూడా ఉండటం విచారణ వేగంగా జరిగేందుకు ఉపకరిస్తుందని న్యాయ వర్గాలు చెబుతున్నాయి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/