Begin typing your search above and press return to search.
ఎన్ డి టీవీ వాటాపై అదానీ గ్రూపు తాజా మాట విన్నారా?
By: Tupaki Desk | 5 Sep 2022 6:51 AM GMTతాను టార్గెట్ చేస్తే సంస్థ ఏదైనా సరే తనతో ఉండేందుకు ఇష్టపడాలి. ఎందుకంటే.. ఆయన గౌతమ్ అదానీ కాబట్టి. దేశంలోని కార్పొరేట్ ప్రపంచంలోని ఎన్నో కంపెనీలు ఉన్నా.. అదానీ గ్రూపును నడిపించే విషయంలో గౌతమ్ అదానీ తీరు కాస్త భిన్నం. అత్యంత దూకుడుగా దూసుకెళ్లే ఆయనకు ఇప్పుడున్న పరిస్థితుల్లో తిరుగే ఉండదు. ఏదైనా కంపెనీని సొంతం చేసుకోవాలన్నా.. ఏదైనా ప్రాజెక్టు తమకే రావాలని ఆయన డిసైడ్ అయ్యాక.. అది వచ్చి తీరాలంతే తప్పించి.. కుదరదు అనే మాట ఆయనకు అస్సలు నచ్చనిదిగా చెబుతారు.
అయితే.. ఇదంతా ఊరికే సాధ్యం కాదు. బోలెడంత అధ్యయనం. దానికి మించిన ఎగ్జిక్యూషన్ తో పాటు.. ఆ క్రమంలో ఎదురయ్యే సమస్యల మీద పెద్ద ఎత్తున ప్లానింగ్ చేసిన తర్వాతే రంగంలోకి దిగుతారు. అందుకే.. ఆయన ఒకసారి రంగంలోకి దిగిన తర్వాతే ముందుకే తప్పించి వెనక్కి వెళ్లటం ఉండదు. ఒకవేళ వెళ్లాల్సిన పరిస్థితే వస్తే.. నాలుగు అడుగులు ముందుకు వేసినట్లే వేసి.. నలభై అడుగుల్ని ఒకేసారి దుమికేసే రకం ఆయన. ఈ మధ్యన ఆయన దేశీయంగా సుపరిచితమైన మీడియా సంస్థ ఎన్ డీటీవీలో వాటా విషయంపై ఆ గ్రూపు చేసిన ప్రకటన.. దానికి సంబంధించిన పరిణామాలు సంచలనంగా మారాయి.
గుట్టుచప్పుడు కాకుండా ఎన్ డీటీవీ అప్పు తెచ్చుకున్న కంపెనీని సొంతం చేసుుకోవటం ద్వారా.. ఎన్ డీటీవీలో భారీ వాటాను సొంతం చేసుకోవటం తెలిసిందే. మెజార్టీ వాటా కోసం ఆయన ఓపెన్ ఆఫర్ ప్రకటించటం తెలిసిందే. ఇలా గౌతమ్ అదానీ తీసుకునే ప్రతి నిర్ణయం మిగిలిన పారిశ్రామికవేత్తలకు భిన్నంగా ఉంటుందనే చెప్పాలి.
ఇదిలా ఉంటే.. ఎన్ డీవీ వాటా మీద ఐటీ శాఖ అనుమతి తీసుకోవాలన్న మాట వినిపిస్తోంది. అయితే.. అదేమీ అక్కర్లేదన్న విషయాన్ని ఆయన స్పష్టం చేస్తున్నారు. ఐటీ నిపుణుల అభిప్రాయం ప్రకారం ఎన్ డీటీవీ వాటా కొనుగోలుపై ఎలాంటి ఆంక్షలు ఉండవన్న విషయాన్ని స్పష్టం చేసిన అదానీ గ్రూపు.. 'ఎన్ డీటీవీలో వాటా కొనుగోలుకు ఐటీశాఖ అనుమతి అక్కర్లేదని భావిస్తున్నాం'' అని పేర్కొండి.
ఇక.. ఎన్ డీటీవీ ప్రమోటర్ సంస్థ ఆర్ఆర్ పీఆర్ హోల్డింగ్ కు దశాబ్దం క్రితం వీసీపీఎల్ రూ.403 కోట్ల అప్పు ఇవ్వటం తెలిసిందే. ఆ తర్వాత సదరు సంస్థను అదానీ గ్రూప్ సొంతం చేసుకుంది. ఆర్ఆర్ పీఆర్ కు అందించిన రుణాలకు సంబంధించి ఎప్పుడైనా ఈక్విటీగా మార్చుకునేలా వారంట్లను సంస్థ పొందింది. ఇటీవల ఆ వారంట్లను ఈక్విటీగా మార్చుకుంటున్నట్లు వెల్లడించింది.
దీంతో 29.18 శాతం వాటాను సొంతం చేసుకుంది. దీనికి ఐటీ అధికారుల అనుమతి అవసరమని ఎన్ డీటీవీ అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో అదానీ గ్రూప్ ఆ అవసరం లేదని స్ప్షష్టం చేయటం గమనార్హం. గౌతమ్ అదానీ లాంటోడు ఎన్ డీటీవీ లాంటి మీడియా సంస్థలో వాటాను తీసుకోవాలని అనుకున్న తర్వాత.. సరైన గ్రౌండ్ వర్కు చేసిన తర్వాతే రంగంలోకి దిగుతారు కదా? ఆ చిన్న విషయాన్ని అంత పెద్ద మీడియా సంస్థ ఎలా మిస్ అవుతుందన్నది ఇప్పుడు ప్రశ్నగా మారిందని చెప్పాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.