Begin typing your search above and press return to search.
ప్రపంచంలో అత్యంత పలుకుబడి వ్యక్తుల్లో చోటు దక్కించుకున్న అదానీ
By: Tupaki Desk | 24 May 2022 4:28 AM GMTఅతి తక్కువ వ్యవధిలో అత్యంత వేగంగా దూసుకెళ్లటం.. తనకు తిరుగు లేదన్నట్లుగా వ్యాపార ప్రపంచంలో వెలిగిపోవటం అంత తేలికైన విషయం కాదు. అందునా.. ఒక ప్రాంతీయ వ్యాపార సంస్థగా ఉన్న కంపెనీ ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా అందరి నోట నానేలా చేయటమే కాదు.. అది ఇది కాదు.. ఏ వ్యాపారమైనా సరే అదానీ తర్వాతే అనుకునేలా చేసిన గౌతమ్ అదానీ తాజాగా మరో ఘనతను సొంతం చేసుకున్నారు.
ప్రఖ్యాత మీడియా సంస్థ టైమ్ మ్యాగజైన్ తాజాగా ప్రపంచంలోనే అత్యంత పలుకుబడి వ్యక్తుల టాప్ 100 జాబితాను సిద్ధం చేసింది. ఆ లిస్టులో భారత పారిశ్రామిక దిగ్గజం.. అపర కుబేరుడిగా పేరొందిన గౌతం అదానీకి చోటు దక్కింది.
ఈ జాబితాలో చోటు దక్కించుకున్న వారిలో అమెరికా అధ్యక్షుడు జో బిడెన్.. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ.. రష్యా ప్రెసిడెంట్ పుతిన్ తో పాటు.. చైనా అధ్యక్షుడు.. యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్..
ప్రముఖ టెన్నిస్ క్రీడాకారుడు రాఫెల్ నాదల్ తో పాటు.. యాపిల్ సీఈవో టిమ్ కుక్.. మీడియా మొఘల్ ఓప్రా విన్ ఫ్రే లాంటి ప్రముఖులు పలువురు ఈ జాబితాలో చోటు దక్కించుకున్నారు.
అంతటి ప్రముఖుల మధ్య మన దేశానికి చెందిన అదానీ గ్రూపు సంస్థల అధినేత గౌతం అదానీకి తొలిసారి చోట దక్కింది. ఎయిర్ పోర్టులు.. పోర్టులు.. సోలార్.. థర్మల్ పవర్ తో పాటు.. వినియోగరంగానికి చెందిన పలు ఉత్పత్తులతో పాటు..
కొత్త తరహా వ్యాపారాల దిశగా దూసుకెళుతున్న అదానీ గ్రూప్.. దేశంలోనే దిగ్గజ గ్రూపుల్లో ఒకటిగా ఎదిగినట్లుగా టైమ్ మ్యాగజైన్ పేర్కొంది. ఈ జాబితాలో ప్రముఖ న్యాయవాది కరుణ నందికి కూడా చోటు లభించటం గమనార్హం.