Begin typing your search above and press return to search.
ఇంత కరోనా విలయంలో ఆదానీకి లాభాల పంట
By: Tupaki Desk | 6 May 2021 7:30 AM GMTకరోనా కల్లోలంలో దేశంలోని కోట్ల మంది ఉద్యోగ, ఉపాధి కోల్పోయి దమ్మిడి ఆదాయం లేక అన్నమో రామచంద్రా అంటూ హాహాకారాలు చేస్తున్న పరిస్తితి. సెకండ్ వేవ్ తో మరింతగా సామాన్యుల ఆదాయంపై భారీ దెబ్బ పడింది. ఇప్పుడు కనీస అవసరాలు తీర్చుకుందామంటేనే డబ్బులు లేని పరిస్థితి నెలకొంది. అయితే ఇంతటి ఉపద్రవంలోనూ దేశంలోనే ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతం అదానీకి కాసులు కురుస్తున్నాయి. ఆయనకు ఇంతటి విలయంలో భారీ లాభాలు వచ్చిపడుతున్నాయి.
2020-21 నాలుగో త్రైమాసికంలో అదానీ ఎంటర్ ప్రైజస్ భారీ లాభాలను ఆర్జించడం విశేషం. అదానీ కంపెనీ రూ.233.95 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. పూర్తి ఆర్థిక సంవత్సర లాభం రూ.13,688.985 కోట్లుగా తెలిపింది. మొత్తంగా ఏడాదిలో 282 శాతం మేర లాభాలను గడించినట్లుగా తెలిపింది. దేశంలో ఏ వ్యాపారికి.. ఏ కంపెనీకి ఇంతటి భారీ లాభాలు రాలేదని అంటున్నారు.
ఇక అంతకుముందు ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఈ లాభం 86శాతం ఎక్కువని అదానీ గ్రూప్ తెలిపింది. ఏకంగా 86శాతం లాభాలు చవిచూసిన ఈ కంపెనీ దేశంలో ఇదొక్కటే అంటున్నారు. అన్ని వ్యాపారాలు ఢమాల్ అవుతున్న వేళ అదానీ మాత్రం ఇంతలా సంపాదిస్తుండడం విశేషం.
ఈ గుజరాతీ పారిశ్రామికవేత్త మోడీ హయాంలో దేశీయంగా భారీ కాంట్రాక్టులు, పోర్టులు పొందడమే ఈ లాభాలకు కారణమన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.