Begin typing your search above and press return to search.

ఆసియా కుబేరుల్లో రెండో స్థానంలో అదానీ !

By:  Tupaki Desk   |   21 May 2021 4:06 AM GMT
ఆసియా కుబేరుల్లో రెండో స్థానంలో  అదానీ !
X
కరోనా మహమ్మారి విజృంభణ సమయంలో ప్రపంచం మొత్తం విలవిలలాడిపోతుంటే అదానీ గ్రూప్‌ ఛైర్మన్‌ గౌతమ్‌ అదానీ మాత్రం తన ఆస్తిని పెంచుకుంటూ పోతున్నారు. తాజాగా ఆసియా కుబేరుల్లో రెండో స్థానాన్ని అదానీ గ్రూప్‌ ఛైర్మన్‌ గౌతమ్‌ అదానీ సాధించారు. చైనాకు చెందిన జాంగ్‌ షాన్‌ షన్‌ ను వెనక్కి నెట్టి అదానీ ఈ రికార్డ్ సాధించారు. కొన్ని నెలలుగా అదానీ గ్రూప్‌ కంపెనీల షేర్లు దూసుకెళ్లడం బాగా కలిసొచ్చింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో జాంగ్‌ను వెనక్కి నెట్టి , ఆసియా కుబేరుడిగా రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధిపతి ముకేశ్‌ అంబానీ అవతరించారు.

బ్లూమ్‌ బర్గ్‌ బిలియనీర్‌ సూచీ ప్రకారం అదానీ నికర సంపద 66.5 బిలియన్‌ డాలర్లకు చేరగా , జాంగ్‌ సంపద 63.6 బిలియన్‌ డాలర్లుగా ఉంది. ఈ ఏడాది అదానీ సంపద విలువ ఏకంగా 32.7 బిలియన్‌ డాలర్లు పెరిగింది. ఇదే సమయంలో అంబానీ సంపద 175.5 మిలియన్‌ డాలర్లు తగ్గి 76.5 బిలియన్‌ డాలర్లకు చేరింది. ఈ ఏడాదిలో అదానీ ఆస్తి 3,270 కోట్ల డాలర్ల మేర పెరగగా.. షాన్షాన్‌ ఆస్తి 1,460 కోట్ల డాలర్లు క్షీణించింది. ఇక ఆసియా నెం.1 అంబానీ ఆస్తి 7,650 కోట్ల డాలర్లుగా ఉంది. మన కరెన్సీలో సుమారు రూ.5.58 లక్షల కోట్లు. ప్రస్తుతం ప్రపంచ కుబేరుల జాబితాలో ముకేశ్‌ 13వ స్థానంలో, గౌతమ్‌ అదానీ 14వ స్థానంలో ఉన్నారు. ఈ ఏడాది ప్రారంభంలో జాంగ్‌ కు చెందిన రెండు కంపెనీలు స్టాక్‌ ఎక్స్ఛేంజీల్లోకి రావడంతో ప్రపంచంలోనే ఆరో సంపన్నుడయ్యారు.