Begin typing your search above and press return to search.

అదానీ థ‌ర్డ్ ప్లేస్‌.. కానీ, ఎంప్లాయీస్ అంద‌రూ.. టీసీఎస్‌, ఇన్ఫోసిస్‌, విప్రో అని అంటున్నారే!

By:  Tupaki Desk   |   7 Sep 2022 9:44 AM GMT
అదానీ థ‌ర్డ్ ప్లేస్‌.. కానీ, ఎంప్లాయీస్ అంద‌రూ.. టీసీఎస్‌, ఇన్ఫోసిస్‌, విప్రో అని అంటున్నారే!
X
గౌతం అదానీ.. ఈ పేరు ఇప్పుడు దేశ‌వ్యాప్తంగా అంద‌రి చెవుల్లోనూ మార్మోగుతున్న విష‌యం తెలిసిందే. ముఖ్యంగా కేంద్రంలోని న‌రేంద్ర మోడీ స‌ర్కారుపై ప్ర‌తిప‌క్షాలు చేసే విమ‌ర్శ‌ల్లో త‌ర‌చుగా.. ఇద్ద‌రు వ్యాపార వేత్త‌ల పేర్లు వినిపిస్తుంటాయి. వారిలో అదానీ ఒక‌ర‌ని అంటారు. గుజ‌రాత్‌కు చెందిన అదానీ.. దేశ‌వ్యాప్తంగా గ‌త మూడేళ్ల‌లో భారీ ఎత్తున వ్యాపార సామాజ్రాన్ని విస్త‌రించారు. విస్త‌రిస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ విష‌యం దేశంలో హాట్ టాపిక్‌గా న‌డుస్తోంది.

బీజేపీ అనుకూల రాష్ట్రాలు.. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో పోర్టులు, విమానాశ్ర‌యాలు, ప‌రిశ్ర‌మ‌ల‌ను ఆయ‌న ల‌క్ష‌ల కోట్ల రూపాయ‌ల‌తో నెల‌కొల్పుతున్న ప‌రిశ్ర‌మ‌ల గురించి..త‌ర‌చుగా వార్త‌లు కూడా వ‌స్తున్నాయి. ముఖ్యంగా ఏపీలో.. ఇప్పుడు అదానీ హ‌వా సాగుతోంద‌ని ప్ర‌తిప‌క్షాలు అంటున్నాయి. కృష్ణ‌ప‌ట్నం నుంచి నెల్లూరు వ‌ర‌కు.. మ‌చిలీ ప‌ట్నం నుంచి విశాఖ వ‌ర‌కు.. అదానీ వ్యాపార సామ్రాజ్యాన్ని విస్త‌రిస్తున్న‌ట్టు.. ఆయ‌న‌కు రాష్ట్ర ప్ర‌భుత్వం స‌హ‌క‌రిస్తున్న‌ట్టు వార్త‌లు రావ‌డం తెలిసిందే.

ఇక‌, ఇటీవ‌లే.. అదానీ.. ఆసియాలోనే అతిపెద్ద వ్యాపార వేత్త‌, అప‌ర కుబేరుడుగా ఎదిగార‌నే వార్త‌లు కూడా వ‌చ్చాయి. ఆయ‌న ఆదాయం.. సంప‌ద కూడా పెరిగాయని.. అంటున్నారు. అయితే.. ఇంత‌వ‌ర‌కు బాగానే ఉన్న‌ప్ప‌టికీ.. ఉద్యోగ రంగానికి వ‌చ్చే స‌రికి అదానీ పేరు ఎక్కడ వినపడటం లేదు. ప్ర‌స్తుతం వ్యాపారాల ప‌రంగా.. వాణిజ్యం ప‌రంగా.. ప్ర‌పంచంలోనే మూడో స్థానంలో ఉన్న‌ప్ప‌టికీ.. ఆయ‌న ఉద్యోగాల కల్ప‌న‌, యువ‌త‌ను ప్రోత్స‌హించే విష‌యంలో మాత్రం.. వెనుక‌బ‌డ్డార‌నేది టాక్‌.

అదానీ.. వ్యాపారాల‌ను చూసుకుంటే.. ప్ర‌జ‌ల సొమ్మును.. లేదా.. రైతుల‌కు చెందిన పొలాల‌ను.. ప్ర‌భు త్వాలు.. ఆయ‌న‌కు రాయితీల‌రూపంలోనో.. మ‌రే ఇత‌ర రూపాల్లోనో ధార‌పోస్తున్నాయి. అంటే.. ప‌రోక్షంగా అదానీ.. ప్ర‌జ‌లకు రుణ‌ప‌డుతున్నార‌న్న‌మాట‌.

ఈ నేప‌థ్యంలో మ‌రి ఆయ‌న ప్ర‌జ‌ల‌కు చేస్తున్న మేలేమై నా ఉందా? అంటే.. ప్ర‌శ్నార్థ‌క‌మే. ప్ర‌స్తుతం దేశాన్ని నిరుద్యోగం ప‌ట్టిపీడిస్తోంది. ఈ క్ర‌మంలో ఆయ‌న ఉద్యోగ క‌ల్ప‌న‌పై దృష్టి పెట్ట‌డం లేదు.

ఇక‌, అదానీ కంపెనీల్లో ఉద్యోగాల గురించి పెద్ద చర్చ ఎక్కడ ఉండటం లేదు. అంద‌రూ కూడా.. టీసీఎస్‌, ఇన్ఫోసిస్‌, విప్రో, టెక్ మ‌హీంద్ర‌.. అంటున్నారు కానీ, ఎవ‌రూ కూడా అదానీ ఉద్యొగాల చర్చ పెద్దగా తేవడం లేదు . దీనిని బ‌ట్టి నిజానికి అంత పెద్ద కంపెనీ అయితే.. కొన్ని ల‌క్ష‌ల ఉద్యోగాలు ఇచ్చి.. ప్ర‌త్య‌క్షంగానో.. ప‌రోక్షంగానో.. ప్ర‌జ‌ల‌కు సాయం చేసే అవ‌కాశం ఉన్న‌ప్ప‌టికీ.. అదానీ అలా చేయ‌డం లేదా?..ఏమ‌నుకోవాలి? అనేది మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.