Begin typing your search above and press return to search.

చెదిరిన అంబానీ రికార్డు.. బ్రేక్ చేసిన అదానీ..!

By:  Tupaki Desk   |   24 Nov 2021 3:30 PM GMT
చెదిరిన అంబానీ రికార్డు.. బ్రేక్ చేసిన అదానీ..!
X
భారతదేశంలోనే నెంబర్ వ‌న్ కుబేరుడిగా ఉన్న రిల‌య‌న్స్ ఇండ‌స్ట్రీస్‌ అధినేత ముఖేశ్ అంబానీ ఇప్పటివరకు ఆసియా కుబేరుడిగా కూడా తన రికార్డు నిలుపుకుంటూ వచ్చారు. కొన్ని సంవత్సరాలుగా ఆసియాలోనే అత్యంత సంపన్నుడుగా ముఖేశ్ అంబానీ నిలుస్తున్నారు. అయితే ఇప్పుడు ఆ రికార్డును అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ బ్రేక్ చేశారు. ఆసియాలో అత్యంత సంపన్నుడు ముఖేశ్ అంబానీ రికార్డును బ్రేక్ చేస్తూ అదానీ సరికొత్త రికార్డు నెలకొల్పారు. బ్లూమ్‌బర్గ్ నుంచి అందుబాటులో ఉన్న డేటా ప్ర‌కారం చూస్తే ఇప్పుడు అదానీయే టాప్ ప్లేసులో ఉన్నారు.

బ్లూమ్‌బర్గ్ డేటా ప్రకారం గౌతమ్ అదానీ సంపద 88.8 బిలియన్ డాలర్ల‌కు చేరుకుంది. ఇక ముఖేష్ సంప‌ద 91 బిలియ‌న్ డాల‌ర్లుగా ఉంది. అయితే ఈ నివేదిక వ‌చ్చిన వెంట‌నే రియ‌ల‌న్స్ షేర్లు భారీగా ప‌త‌నం అయ్యాయి. దీంతో అంబానీ సంప‌ద కొద్దిగా ఆవిరైంది. ఈ క్ర‌మంలోనే ఇప్పుడు అదానీ ముందుకు దూసుకు వ‌చ్చారు. ఓ వైపు రియ‌ల‌న్స్ షేర్లు ప‌త‌నం కాగా.. అదే స‌మ‌యంలో అదానీ గ్రూప్‌న‌కు చెందిన షేర్లు ప‌రుగులు పెట్టాయి.

కార‌ణం ఏంటో తెలియ‌దు కాని.. ఆరామ్ కోతో డీల్ కుదిరిన త‌ర్వాత రిల‌య‌న్స్ షేర్లు బాగా ప‌త‌నం అవుతున్న‌ట్టు ట్రేడ్ వ‌ర్గాల్లో చ‌ర్చ న‌డుస్తోంది. నిన్న మొన్న‌టి వ‌ర‌కు రూ.2500కు పైకి ఉన్న రిలయన్స్ షేర్ విలువ ఇప్పుడు రూ.2350 దిగువకు వచ్చింది. ఈ క్షీణ‌త ఏకంగా 5.7 శాతంగా ఉంది. అదే స‌మ‌యంలో అదానీ ఎంట‌ర్‌ప్రైజెస్ షేర్లు 2.94 శాతం లాభ‌ప‌డ్డాయి. ఒక్క అదానీ గ్యాస్ స్టాక్స్ మిన‌హా ఆ గ్రూప్‌న‌కు చెందిన అదానీ ఎంటర్‌ప్రైజెస్ స్టాక్ - అదానీ పోర్ట్స్ - అదానీ ట్రాన్స్ మిషన్ - అదానీ పవర్ స్టాక్ అమాంతం లాభ‌ప‌డ్డాయి.

ముఖేష్‌కు మ‌రో షాక్ ఏంటంటే సెప్టెంబర్ నెలలో రిలయన్స్ జియో దాదాపు 1.9 కోట్ల మంది యూజ‌ర్ల‌ను కోల్పోయింది. దీంతో జియో ప్ర‌భావం కూడా రిల‌య‌న్స్ షేర్ల‌పై గ‌ట్టిగా ప‌డ‌నుంది. అదే స‌మ‌యంలో 2.74 లక్షల మంది కొత్త సబ్‌స్క్రైబర్లను భారతీ ఎయిర్‌టెల్ సొంతం చేసుకుంది.