Begin typing your search above and press return to search.

అంబానీని దాటేసిన అదానీ .. 24 గంటలకి వెయ్యి కోట్ల ఆదాయం!

By:  Tupaki Desk   |   30 Sep 2021 11:30 AM GMT
అంబానీని దాటేసిన అదానీ .. 24 గంటలకి వెయ్యి కోట్ల ఆదాయం!
X
ఆసియాలో రెండవ ధనవంతుడు, ప్రపంచంలోని 14 వ ధనవంతుడైన గౌతమ్ అదానీకి కరోనా మహమ్మారి సమయంల చాలా అద్భుతంగా కలిసి వచ్చింది. గత ఏడాది కాలంలో అతని సంపద అనేక రెట్లు పెరిగింది. రోజువారీ సంపాదన గురించి మాట్లాడుతూ అతను ప్రపంచంలో 11 వ ధనవంతుడైన ముఖేష్ అంబానీ కంటే ఆరు రెట్లు ఎక్కువ సంపాదిస్తాడు. IIFL వెల్త్ హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2021 నివేదిక ప్రకారం గత ఏడాదిలో గౌతమ్ అదానీ కుటుంబం రోజువారీగా రూ. 1000 కోట్లు సంపాదించారు.

ముఖేష్ అంబానీ కుటుంబం రూ. 163 కోట్లు ఆర్జించారు. ఈ జాబితాలో తొలిసారిగా గౌతమ్ అదానీ సోదరుడు వినోద్ శాంతిలాల్ అదానీ టాప్ -10 లో చోటు దక్కించుకున్నారు. టాప్ -10 జాబితాలో స్టీల్ కింగ్ లక్ష్మి నివాస్ మిట్టల్ & ఫ్యామిలీ రోజువారీ సంపాదనలో రెండవ స్థానంలో ఉంది. అతను రోజూ 312 కోట్లు సంపాదించాడు. శివ్ నాడార్ & ఫ్యామిలీ మూడవ స్థానంలో ఉంది. ఇది రోజువారీ 260 కోట్లు సంపాదించింది. నాల్గవ స్థానంలో గౌతమ్ అదానీ సోదరుడు వినోద్ శాంతిలాల్ అదానీ ఉన్నారు. అతను ప్రస్తుతం దుబాయ్‌లో నివసిస్తున్నాడు. అతను గత ఒక సంవత్సరంలో రోజూ 245 కోట్లు సంపాదించాడు. కుమార్ మంగళం బిర్లా రోజుకి 242 కోట్లు సంపాదించిన ఐదవ స్థానంలో ఉన్నారు. వ్యాక్సిన్ కింగ్ సైరస్ పూనవల్ల & ఫ్యామిలీ ప్రతిరోజూ 190 కోట్లు సంపాదించింది.

గౌత‌మ్ అదానీ, ఆయ‌న కుటుంబం ఒక్క ఏడాదిలోనే త‌మ సంప‌ద‌ను నాలుగు రెట్లు పెంచుకోవ‌డ‌మే తాజా లిస్ట్‌ లో ఆశ్చ‌ర్య‌క‌ర‌మైన విష‌యం. దీంతో సంప‌ద విష‌యంలో దేశంలో ముకేశ్ అంబానీ త‌ర్వాత రెండో స్థానంలో నిలిచారు గౌత‌మ్ అదానీ. అంతేకాదు ఏషియా రిచెస్ట్ లిస్ట్‌ లోనూ చైనాకు చెందిన ఝాంగ్ షాన్‌ షాన్‌ ను అదానీ వెన‌క్కి నెట్టి రెండోస్థానానికి చేరిన‌ట్లు ఐఐఎఫ్ఎల్ వెల్త్ హురూన్ ఇండియా రిచ్ లిస్ట్ 2021 వెల్ల‌డించింది. గౌత‌మ్ అదానీతోపాటు ఆయ‌న సోద‌రుడు వినోద్ శాంతిలాల్ అదానీ కూడా ఈ రిచ్ లిస్ట్‌ లో చోటు ద‌క్కించుకోవ‌డం విశేషం.

ఇక ఇదే ఏడాది కాలంలో ముకేశ్ అంబానీ రోజువారీ సంపాద‌న రూ.169 కోట్లుగా ఉంది. ఆయ‌న మొత్తం సంప‌ద 9 శాతం పెరిగి రూ.7.18 ల‌క్ష‌ల కోట్ల‌కు చేరింది. హెచ్‌ సీఎల్ అధినేత శివ్ నాడార్ కుటుంబ సంద‌ప కూడా గ‌తేడాది ఏకంగా 67 శాతం పెరిగి రూ.2.36 ల‌క్ష‌ల కోట్ల‌కు చేర‌డం విశేషం. గ‌తేడాది ఆయ‌న ప్ర‌తి రోజూ రూ.260 కోట్లు సంపాదించారు. అటు ల‌క్ష్మీ మిట్ట‌ల్ కుటుంబం గ‌తేడాది రోజుకు రూ.312 కోట్ల సంప‌ద‌ను పోగేసుకున్న‌ట్లు ఈ లిస్ట్ వెల్ల‌డించింది. వ్యాక్సిన్ త‌యారీదారు సైర‌స్ పూనావాలా, ఆయ‌న కుటుంబం గ‌తేడాది ఏడాదికి రూ.190 కోట్లు సంపాదించింది.

ఇండియాలో గ‌తేడాది కొత్త‌గా 58 మంది బిలియ‌నీర్లు చేర‌డం విశేషం. దీంతో దేశంలో 2020-21లో మొత్తం బిలియ‌నీర్ల సంఖ్య 258కి చేరింది. ఇక ఇండియాలో యంగెస్ట్ బిలియ‌నీర్‌గా భారత్‌పె పేమెంట్స్ యాప్ కోఫౌండ‌ర్ శాశ్వ‌త్ న‌క్రానీ నిలిచారు. ఈ లిస్ట్‌పై హురూన్ ఇండియా ఎండీ, చీఫ్ రీసెర్చ‌ర్ అన‌స్ రెహ‌మాన్ జునైద్ మాట్లాడుతూ.. ప‌దేళ్ల‌లో ప‌ది రెట్లు. ప‌దేళ్ల కింద‌ట మా లిస్ట్‌లో కేవ‌లం 100 మంది ఉండ‌గా.. ఇప్పుడు వారి సంఖ్య 1007కు చేరింది.