Begin typing your search above and press return to search.
11 మందిని పెళ్లాడి.. పక్కపక్క వీధుల్లో ఏడుగురు భార్యలతో కాపురం!
By: Tupaki Desk | 14 July 2022 3:31 AM GMTకొందరి చావు తెలివితేటలు వింటే విస్మయానికి గురి కావాల్సిందే. దరిద్రపుగొట్టు పనుల విషయంలో ఇంతటి టాలెంట్ చూపించే ఇలాంటి క్రిమినల్స్.. సరైన అంశం మీద వారి మనసును లగ్నం చేసి ఉంటే.. మరెంత ఉన్నత స్థానాల్లోకి వెళ్లి ఉండేవారో అనుకోకుండా ఉండలేం. కానీ.. వారుచేసిన దారుణాల గురించి తెలిసిన తర్వాత.. వారిని ఎట్టి పరిస్థితుల్లో విడిచి పెట్టకపోవటమే మంచిదన్న భావన కలుగుతుంది. ఇప్పుడు చెప్పే ఉదంతంలోని నిత్య పెళ్లి కొడుకు ఈ కోవలోకే వస్తాడు.
ఒకరు కాదు ఇద్దరు కాదు ముగ్గురు కూడా కాదు.. ఒకరికి ఒకరు తెలీకుండా ఒకరు చొప్పున ఏకంగా పదకొండు మందిని పెళ్లాడిన ఇతగాడి చరిత్రను విప్పి చెప్పేశారు అతగాడి భార్యామణులు. కొండాపూర్ ప్రాంతంలో ఒక భార్యకు తెలీకుండా మరో భార్య వద్ద ఉంటూ ఏకంగా ఏడు కాపురాల్ని మొయింటైన్ చేసిన సత్తా అతగాడి సొంతం.తాజాగా హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలొ ఇతగాడి జాతకాన్ని విడమర్చి చెప్పిన వైనం విన్నప్పుడు ఆశ్చర్యానికి గురి కావటమే కాదు.. ఇలా కూడా సాధ్యమా? అన్న భావన కలుగకమానదు.
ఏపీలోని గుంటూరు జిల్లా బేతంపూడికి చెందిన అడపా శివశంకర్ బాబు.. పెళ్లి చేసుకుంటానని చెప్పి.. వారిని ముగ్గులోకి దించుతారని చెప్పాలి. దీనికి కారణం లేకపోలేదు. తాను భర్త నుంచి విడిపోయిన వారిని వెతికి మరీ గుర్తించే ఇతడు.. వారికి చెప్పాల్సిన మాయ మాటలన్ని చెప్పేసేవాడు.
విడాకులు తీసుకున్న వారిని వెతికి మరీ పట్టుకొనే ఇతగాడు.. వారికి మాయమాటలు చెప్పేసి.. పెళ్లికి ఒప్పించేయటమే కాదు.. ఒకవేళ వారిద్దరూ ఉద్యోగాన్ని చేస్తుండటమే అయితే.. ఏదో ఒక మాట చెప్పి.. వారికి ఆ ఉద్యోగం దొరక్కుండా చేసేటోళ్లు. ఎందుకంటే.. తాను పెళ్లాడిన మహిళ ఉద్యోగం చేయకుంటే.. తనకు పని చేసి పెట్టేందుకు సాయం చేస్తారన్న చావు తెలివి తేటలతో ఇలా ఇంటికే పరిమితం చేస్తారని చెబుతున్నారు.
ఇలా ఒకరు తర్వాత ఒకరు చొప్పున ఏకంగా పదకొండు మందిని పెళ్లాడటం ఒక ఎత్తు అయితే.. అందులో ఇద్దరు భార్యల్ని కొండాపూర్ లోని ఒకే చోట ఉన్నప్పటికి వేర్వేరు వీధుల్లో ఉంచేసి.. రాత్రిళ్లు కంపెనీలో షిఫ్టు అని చెప్పేసి.. ఇంట్లో నుంచి వెళ్లిపోయేవాడు. ఇదంతా ఎందుకంటే.. ఒక భార్య ఇంటి నుంచి మరో భార్య ఇంటికి వెళ్లేవాడు. తెలిసిన వారందరికి ఒక పెద్ద కంపెనీలో పని చేస్తానంటూ బిల్డప్ ఇచ్చేవాడు. ఒక సందర్భంలో అనుమానం వచ్చిన ఒక భార్య.. అతన్ని ఫాలో కావటం.. అనుమానం బలపడి ఎంక్వయిరీ చేయగా.. అతగాడి తేడా వ్యవహారం బయటకు వచ్చింది. మరింత లోతుగా విచారణ చేయగా.. మొత్తం పదకొండు మందిని అతగాడు పెళ్లాడినట్లుగా బాధితురాలు గుర్తించారు.
అనంతరం విచారణ జరిపి.. మోసపోయి పెళ్లాడిన పదకొండు మందిని గుర్తించారు. అయితే.. తనకు రాజకీయ పలుకుబడి ఉందని..తనపై కత్తి గడితే సంగతి చూస్తానని బెదిరించి.. డబ్బులు.. బంగారాన్ని విపరీతంగా లాగేసే ఇతగాడి మీద చర్యలు తీసుకోవాలంటూ భార్యామణులు ఇద్దరు ఈ రోజు మీడియా ముందుకు వచ్చి.. అతడి గుట్టు మొత్తం విప్పి చెప్పటంతో.. ఇతడి మోసం ఇట్టే అర్థమయ్యేలా చేసింది. పోలీసుల్ని అతగాడ్ని అదుపులోకి తీసుకొని.. అతడి మీద రౌడీ కేస్ నమోదు చేయాలన్న డిమాండ్ అంతకంతకూ పెరుగుతోంది. మరి.. ఈ నిత్య పెళ్లికొడుక్కి పోలీసులు.. తమదైన ట్రీట్ మెంట్ ఇప్పిస్తే మరెన్ని షాకింగ్ నిజాలు బయటకు వస్తాయేమో? అన్నదిప్పుడు ప్రశ్నగా మారిందని చెప్పక తప్పదు.