Begin typing your search above and press return to search.

నోరుజారిన వైసీపీ నేత.. బుక్కయ్యాడు

By:  Tupaki Desk   |   28 May 2020 3:45 AM GMT
నోరుజారిన వైసీపీ నేత.. బుక్కయ్యాడు
X
ఒక్కోసారి మనం వివరణ ఇవ్వడంలో వాడే పదాలు మొదటికే మోసం తెస్తాయి.. మనవారినే విమర్శించేలా చేస్తాయి. ఆ మాటలు దొర్లడంలో చేసిన పొరపాటుతో ఓ వైసీపీ నేత బుక్కయ్యాడు. నోరు జారీ సొంత పార్టీ నేతల నుంచే ఇప్పుడు తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు.

జనసేన పార్టీ అధికార ప్రతినిధిగా బాగా పాపులారిటీ సంపాదించి ఆ పార్టీ సార్వత్రిక ఎన్నికల్లో ఓటమితో వైసీపీలో చేరాడు అద్దేపల్లి శ్రీధర్. టీవీ చర్చల్లో చురుకుగా కత్తిలాగా షార్ప్ గా వ్యాఖ్యలు చేస్తూ యాక్టివ్ పొలిటీషియన్ గా పేరు తెచ్చుకున్నారు.

వైసీపీ తరుఫున గళం విప్పుతూ టీడీపీపై పదునైన విమర్శలు చేసే అద్దేపల్లి శ్రీధర్ తాజాగా సొంత పార్టీ వైసీపీ నేతలను వెనకేసుకొచ్చే ప్రయత్నంలో నోరుజారాడు. ఇప్పుడు తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నాడు.

తాజాగా ఓ టీవీ చానెల్ తరుఫున వైసీపీ గళం వినిపించాడు శ్రీధర్. ఈ క్రమంలో హైకోర్టుపై వ్యాఖ్యానించిన 49మంది వైసీపీ నేతలపై చర్చ సందర్భంగా తన పార్టీ నేతలను వెనకేసుకొచ్చే ప్రయత్నంలో నోరుజారాడు. అలా నోటీసులు అందుకున్న 49మందిలో 98శాతం మంది చదువురాని నిరక్షరాస్యులని.. వారికి సోషల్ మీడియాలో, మీడియాలో మాట్లాడడం రాక.. హైకోర్టు చట్టాల గురించి తెలియక బుక్కయ్యారని వ్యాఖ్యానించారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు దుమారం రేపాయి.