Begin typing your search above and press return to search.
మీడియా రంగంలోకి అంబానీలానే అదానీ కూడా.. ఆ టీవీ చానెళ్లలోకి ఎంట్రీ!
By: Tupaki Desk | 24 Aug 2022 4:24 AM GMTభారతదేశంలో అత్యంత ధనవంతుడిగా రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేష్ అంబానీని అధిగమించిన గౌతమ్ అదానీ ఇప్పుడు మీడియా రంగంలోకి ప్రవేశించారు. ముకేష్ అంబానీ గతంలో న్యూస్ -18లో మెజారిటీ వాటాను దక్కించుకోగా.. ఇప్పుడు గౌతమ్ అదానీ ఆయన బాటలోనే దేశంలో ప్రముఖ న్యూస్ చానెల్ ఎన్‌డీటీవీలో 29.18 వాటాను కొనుగోలు చేశారు.
కాగా ఎన్‌డీటీవీని ప్రణయ్ రాయ్ ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ప్రణయ్ రాయ్‌తోపాటు ఆయన భార్య రాధికా రాయ్ ఈ టీవీ కార్యకలాపాలను నిర్వహిస్తున్నారు. బీజేపీని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్‌కు అనుకూలంగా వ్యవహరించే చానెల్‌గా ఎన్‌డీటీవీకి పేరుంది.
కాగా ఎన్‌డీటీవీ ప్రస్తుతం మూడు జాతీయ వార్తా ఛానళ్లు నిర్వహిస్తోంది. అవి.. ఎన్‌డీటీవీ 24/7(ఆంగ్లం), ఎన్‌డీటీవీ ఇండియా(హిందీ), ఎన్‌డీటీవీ ప్రాఫిట్(బిజినెస్ వార్తలు). ఆన్‌లైన్‌లో వేర్వేరు ప్లాట్‌ఫాంలపై మొత్తం 3.5 కోట్ల మంది ఫాలోవర్లను ఎన్‌డీటీవీ కలిగి ఉంది. 2021-22లో కంపెనీ ఆదాయం రూ.421 కోట్లుగా నమోదైంది. నికర లాభం రూ.85 కోట్లుగా ఉందని సమాచారం. అప్పులు కూడా అంతగా లేవని అంటున్నారు.
ఈ నేపథ్యంలో గౌతమ్ ఆదానీ ఎన్‌డీటీవీలో వాటా కొనుగోలు అంశం దేశ మీడియా, రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది. ముకేష్ అంబానీలా గౌతమ్ అదానీ కూడా మీడియా రంగంలోకి ఎంట్రీ ఇవ్వడం బిజినెస్ వర్గాల్లో భారీ చర్చ కు కారణమైందని వార్తలు వస్తున్నాయి. మరోవైపు గౌతమ్ అదానీ గుజరాత్‌కు చెందినవారు. ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాలకు అత్యంత సన్నిహితుడిగా పేరుంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌కు అనుకూలమైన చానెల్‌గా పేరున్న ఎన్‌డీటీవీలో గౌతమ్ అదానీ వాటా కొనుగోలు సంచలన వార్తగా మారింది. మరి ఈ నేపథ్యంలో ఎన్‌డీటీవీ బీజేపీ వ్యతిరేక వైఖరి మార్చుకుంటుందా లేదా కాంగ్రెస్‌కు సానుభూతిపరురాలిగానే ఉంటుందా అనేది వేచిచూడాలి.
మరోవైపు గౌతమ్ అదానీ వాటా కొనుగోలు గురించి ఎన్‌డీటీవీ వ్యవస్థాపకులు ప్రణయ్ రాయ్, రాధికా రాయ్‌లకు సమాచారం లేదని అంటున్నారు. స్వయంగా వారే ఈ విషయాన్ని అంతర్గతంగా ఎన్‌డీటీవీ ఉద్యోగులకు తెలిపారని వార్తలు వచ్చాయి. ప్రణయ్ రాయ్, రాధికా రాయ్‌లకే ఎన్‌డీటీవీలో అత్యధిక వాటా 31 శాతానికిపైగా ఉంది. ఈ నేపథ్యంలో వారికి తెలియకుండానే గౌతమ్ అదానీ వాటా కొనుగోలు చేయడం కూడా ఆసక్తికర చర్చకు కారణమవుతోంది.
గతంలో అదానీ ఎంటర్‌ప్రైజెస్.. విశ్వప్రధాన్ కమర్షియల్(వీసీపీఎల్)ను కొనుగోలు చేసింది. ఆ సంస్థ ఎన్‌డీటీవీకి అప్పట్లో రూ.403 కోట్లు రుణమిచ్చింది. ఆ రుణాన్ని ఎన్‌డీటీవీలో 29.18 శాతం వాటాగా అదానీ గ్రూప్ మార్చుకుంది. దీంతో నిబంధనల ప్రకారం... ఎన్‌డీటీవీలో అదనంగా 26 వాటా కొనుగోలు కోసం ఓపెన్ ఆఫర్ ప్రకటిస్తున్నట్లు మంగళవారం స్టాక్ ఎక్స్ఛేంజీలకు అదానీ గ్రూప్ తెలిపింది. ఇప్పటికే రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీకి నెట్‌వర్క్18లో వాటాలున్నాయి. ఈ సంస్థకు సీఎన్‌ఎన్-న్యూస్18, సీఎన్‌బీసీ-టీవీ18లతో పాటు పలు వార్తా ఛానళ్లు ఉండటం గమనార్హం.
ఎన్‌డీటీవీలో రూ.4 ముఖ విలువ గల షేరుకు రూ.294 చొప్పున ఇస్తూ.. 26 శాతం వాటాకు సమానమైన 1,67,62,530 షేర్లను కొనుగోలు చేసేందుకు అదానీ గ్రూప్ ఓపెన్ ఆఫర్ ప్రకటించింది. సంస్థ తరఫున జేఎమ్ ఫైనాన్షియల్ ఈ మేరకు బహిరంగ ప్రకటన విడుదల చేసింది. ఇందుకు రూ.493 కోట్లు వెచ్చిస్తామంది. కాగా 2008లో ఏర్పడిన విశ్వప్రధాన్ కమర్షియల్(వీసీపీఎల్)ను రూ.114 కోట్లతో కొనుగోలు చేసినట్లు అదానీ పేర్కొన్నారు.
అదానీ గ్రూప్ గత కొన్ని నెలలుగా మీడియా రంగంలోకి అడుగుపెట్టేందుకు ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. గతేడాది సెప్టెంబరులో ప్రముఖ జర్నలిస్టు సంజయ్ పుగలియాను తన మీడియా కంపెనీ అదానీ మీడియా వెంచర్స్‌కు అధిపతిగా నియమించుకుంది. క్వింట్ డిజిటల్ మీడియాకు సంజయ్ పుగలియా ప్రెసిడెంట్‌గా పనిచేశారు. గతేడాది డిజిటల్ వ్యాపార వార్తల ప్లాట్‌ఫాం అయిన క్వింటిలియన్ బిజినెస్ మీడియా(క్యూబీఎమ్)ను కూడా అదానీకి చెందిన విశ్వప్రధాన్ కమర్షియల్(వీసీపీఎల్) కొనుగోలు చేయడం గమనార్హం.