Begin typing your search above and press return to search.

ప‌రిటాల రవిలా న‌న్నూ చంపేస్తారేమో! ఆదినారాయ‌ణ‌రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

By:  Tupaki Desk   |   25 Feb 2022 9:32 AM GMT
ప‌రిటాల రవిలా న‌న్నూ చంపేస్తారేమో! ఆదినారాయ‌ణ‌రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు
X
మాజీ మంత్రి, ప్ర‌స్తుత బీజేపీ నాయ‌కుడు.. క‌డ‌ప‌ జిల్లాకు చెందిన ఆదినారాయ‌ణ‌రెడ్డి ఏపీ స‌ర్కారు పై విరు చుకుప‌డ్డారు. త‌న‌ను కూడా ప‌రిటాల ర‌విని చంపిన‌ట్టే చంపేస్తారేమోన‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు. రా ష్ట్రంలో రాక్షస పాలన సాగుతోంద‌న్నారు.

ఇలాంటి దుర్మార్గపు పాలనను ఎన్నడూ చూడలేదన్నారు. అధికారం కోసం ఎన్ని అడ్డదారులైన తొక్కే వ్యక్తి జగన్ అని ఆరోపించారు. ఒక్క ఛాన్స్ అంటూ నాడు జనం నెత్తిన ముద్దులు పెట్టి.. అధికారంలోకి వచ్చాక పిడి గుద్దులు గుద్దుతున్నారని దుయ్యబట్టారు.

తెలంగాణ సీఎం కేసీఆర్ భారత రాజ్యాంగాన్ని మార్చమంటున్నారు. కానీ జగన్ ఇప్పటికే రాజ్యాంగాన్ని మార్చేశారని ఎద్దేవా చేశారు. ఏపీలో ఇప్పుడు భారతి రాజ్యాంగం అమలవుతోంది మండిపడ్డారు. అమరా వతి ఉద్యమం 800 రోజుకు చేరిన సందర్భంగా రాజధాని రైతులకు ఆదినారాయ రెడ్డి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా జగన్‌పై విరుచుకుపడ్డారు. అమరావతి రైతుల, మహిళల పోరాటం కచ్చితంగా ఫలిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. వైసీపీ అధికారంలోకి వస్తే రాజధాని విశాఖకు మారుస్తారని గతంలోనే తాను మంత్రి వర్గంలో ఉన్నప్పుడు చంద్రబాబు చెప్పారని గుర్తు చేశారు. అదే ఇప్పుడు నిజమైందని విమర్శలు గుప్పించారు.

విశాఖపట్నంలో జగన్ కు వేల ఎకరాలు భూములు ఉన్నాయన్నాయని ఆదినారాయణ రెడ్డి ఆరోపించా రు. గతంలో వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే విశాఖపట్నంలో భూములు కొన్నారని పేర్కొన్నారు. నాడు విశాఖలో జగన్ కొన్న ఆ భూములకు ధరల రావాలంటే రాజధాని అక్కడే పెట్టాలని ఆయన ఉద్దేశ మని ఆధినారాయణ రెడ్డి ఆరోపించారు.

అందుకే రాజధానిగా ప్రకటించారని ద్వజమెత్తారు. దోచుకునే వ్యక్తి సీఎం అయితే రాష్ట్రానికి మంచి ఎలా జరుగుతుందన్నారు. సొంత బాబాయి వివేకానంద రెడ్డిని చంపి ఆ కుట్రను పక్కవాళ్లపై మోపే దుర్మార్గులని ఆదినారాయ‌ణ రెడ్డి ఆరోపించారు. వారి సొంత టీవీలో తొలుత గుండెపోటు అని ప్రచారం చేశారు. తర్వాత దానిని గుండెల్లో పోటుగా మార్చారని విమర్శించారు.

వైఎస్ వివేకానంద రెడ్డి కేసులో తొలుత చంద్రబాబు పైన , నా పైన నిందలు మోపారని ఆదినారాయణ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు ఆకేసులో వాస్తవాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయని పేర్కొన్నా రు. కేసును నిరుకార్చేందుకు సీబీఐపైనే వైసీపీ నేతలు నిందలు మోపుతున్నారని దుయ్యబట్టారు. పరిటాల రవీంద్రను చంపినట్లు నన్ను కూడా చంపుతారని మా కుటుంబం భయపడుతోందని పేర్కొన్నా రు. భయపడుతూ ఎన్నాళ్లు ఉంటా... ధైర్యంగా ఉండాలని చెప్పినట్లు ఆదినారాయణ రెడ్డి తెలిపారు.