Begin typing your search above and press return to search.
ఈరోజు ఆ ఊళ్లో తొలిసారి జెండా ఎగిరింది
By: Tupaki Desk | 26 Jan 2016 10:18 PM ISTఆ ఊళ్లో జెండా పండుగ అస్సలు తెలీదు. ఆ మాటకు వస్తే త్రివర్ణ పతాకం ఇప్పటివరకూ ఆ ఊళ్లో ఎగిరిందే లేదు. ఆగస్టు 15న.. జనవరి 26న జెండావందనం చేపట్టటం తెలిసిందే. స్వాతంత్ర్య దినోత్సవం.. గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశ వ్యాప్తంగా తిరంగా పండుగ జరిగినా.. తెలంగాణ లోని అదిలాబాద్ జిల్లా టాక్లి గ్రామంలో తొలిసారి జెండా పండుగను నిర్వహించారు.
బయట ప్రపంచానికి దూరంగా ఉండే ఈ గ్రామంలో ఇప్పటివరకూ జెండా ఎగురవేసింది లేదు. ఈ విషయం మీడియాలో రావటంతో జిల్లా అధికారులు దృష్టి సారించటంతో ఈ రోజు ప్రత్యేకంగా ఆ గ్రామంలో జెండా పండుగను చేపట్టారు. స్వాతంత్ర్యం వచ్చిన ఇన్నాళ్లకు తొలిసారి గ్రామంలో ఎగిరిన త్రివర్ణ పతాకాన్ని చూసిన గ్రామస్తుల ఆనందానికి హద్దుల్లేకుండా పోయింది. ఈ డిజిటల్ యుగంలోనూ దేశంలో ఇంకా జెండా ఎగరని గ్రామాలు ఉండటం ఆశ్చర్యం కలిగించే అంశమే కదూ.