Begin typing your search above and press return to search.
కరోనా ఆస్పత్రిలో మహిళ ఆత్మహత్యాయత్నం.... కారణం ఇదే!
By: Tupaki Desk | 31 July 2020 3:32 PM GMTకరోనా మహమ్మారి మనుషుల మధ్య సంబంధాలని , బంధుత్వాలని మంటకలిపేస్తుంది. రోజురోజుకి దేశంలో కరోనా పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అందరిలో ఆందోళన కూడా రెట్టింపు అవుతుంది. కరోనా నేపథ్యంలో కొంతమంది కనీసం మనం మనుషులం అన్న సంగతి మర్చిపోయి ప్రవర్తిస్తున్నారు. కరోనా వచ్చిన వారికీ దైర్యం చెప్పి , సహాయంగా నిలవాల్సింది పోయి , మాకేం సంబంధం లేదు అన్నట్టుగా ప్రవర్తిస్తున్నారు. కొందరు కనీసం కరోనా తో చనిపోతే మృతదేహాలని తీసుకోవడానికి కూడా రావడం లేదు. మరికొందరు ఇంటి సభ్యులు కరోనా భారిన పడి .. కోలుకొని ఇంటికి తిరికి వస్తే సంతోషంగా ఆహ్వానించాల్సింది పోయి , వారిని అంటరానివారిగా చూస్తూ అసలు ఇంట్లోకి రానివ్వని ఘటనలు చాలా చోట్ల వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా అలాంటి ఘటనే మరొకటి విజయవాడలో వెలుగులోకి వచ్చింది.
వివరాల్లోకి వెళ్తే .. విజయవాడ కరోనా ఆసుపత్రిలో ఓ మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఆస్పత్రి రెండో అంతస్థు నుంచి ఆదిలక్ష్మి అనే మహిళ కిందకు దూకేసింది. తీవ్రగాయాలవ్వడంతో, వైద్యులు ఆమెకు చికిత్స అందిస్తున్నారు. ఆమె ఆత్మహత్యాయత్నానికి సంబంధించి పోలీసులు విచారణ చెయ్యగా, అసలు విషయం తెలిసి పోలీసులు కూడా షాక్ అయ్యారు. ఆదిలక్ష్మి కరోనా తో పోరాటం చేసి తాజాగా కోలుకోవడంతో వైద్యులు ఆమెను హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ చేశారు. అయితే ఆమెను ఇంటికి తీసుకెళ్లేందుకు కుటుంబ సభ్యులు నిరాకరించారు. దీనితో తీవ్ర మనస్థానికి చెందిన ఆదిలక్ష్మి ఆత్మహత్యాయత్నం చేసింది. కాగా ఆ మహిళ చల్లపల్లి మండలం నారాయణపురం వాసిగా పోలీసులు గుర్తించి..ఈ ఘటనపై విచారణ చేస్తున్నారు.